Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Back Pain Symptoms: మిమ్మల్ని వెన్నునొప్పి సమస్య వేధిస్తుందా? అయితే మీకు ఆ సమస్య ఉన్నట్లే.. వెంటనే డాక్టర్ సంప్రదించాల్సిందే..!

ప్రపంచ ఆస్తమా దినోత్సవం నేపథ్యంలో వెన్నునొప్పికి ఆస్తమాకు మధ్య ఉన్న సంబంధం ఏంటో ఓ సారి తెలుసుకుందాం. ఆస్తమాను ఉబ్బసం అని కూడా అంటారు. ఇది తీవ్రమైన శ్వాసకోశ పరిస్థితి. శ్వాసనాళాలు ఇరుకుగా మారడం లేదా ఉబ్బినా ఈ సమస్య వస్తుంది.

Back Pain Symptoms: మిమ్మల్ని వెన్నునొప్పి సమస్య వేధిస్తుందా? అయితే మీకు ఆ సమస్య ఉన్నట్లే.. వెంటనే డాక్టర్ సంప్రదించాల్సిందే..!
Back Pain
Follow us
Srinu

|

Updated on: May 02, 2023 | 6:45 PM

ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా వివిధ ఆరోగ్య సమస్యలు వయస్సుతో సంబంధం లేకుండా వేధిస్తున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహన వినియోగం పెరగడం వల్ల వెన్నునొప్పి సమస్య ఇబ్బందికి గురి చేస్తుంది. అయితే సాధారణంగా వెన్నెముకపై అధిక ఒత్తిడి పడితే వెన్ను నొప్పి వస్తుందని అందరూ అనుకుంటారు. అయితే ఆ విషయం తప్పని ఆస్తమా ఉన్నా వెన్నునొప్పి సమస్య వేధిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నేడు ప్రపంచ ఆస్తమా దినోత్సవం నేపథ్యంలో వెన్నునొప్పికి ఆస్తమాకు మధ్య ఉన్న సంబంధం ఏంటో ఓ సారి తెలుసుకుందాం. ఆస్తమాను ఉబ్బసం అని కూడా అంటారు. ఇది తీవ్రమైన శ్వాసకోశ పరిస్థితి. శ్వాసనాళాలు ఇరుకుగా మారడం లేదా ఉబ్బినా ఈ సమస్య వస్తుంది. ఇది తరచూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురి చేస్తుంది. అలాగే అదనపు శ్లేష్మం కూడా ఉత్పత్తి అయ్యి ఇబ్బంది పెడుతుంది. ఉబ్బసం ప్రారంభ లక్షణాలు దగ్గు, ఊపిరి పీల్చుకునేటప్పుడు విజిల్ (వీజింగ్), శ్వాస ఆడకపోవడంగా ఉంటుంది. ఇది శ్వాసకోశ వ్యాధి అయినప్పటికీ ఈ పరిస్థితి తరచుగా వెన్నెముక ప్రాంతంలో నొప్పిని కలిగిస్తుంది. ఆస్తమా, వెన్ను నొప్పి వంటి శ్వాస విధానాల రుగ్మతల మధ్య బలమైన సంబంధాన్ని పలు అధ్యయనాల్లో వెల్లడయ్యాయి. ముఖ్యంగా దిగువ వీపు, మెడ మరియు భుజాల్లో నొప్పి వస్తే వెంటనే అలర్ట్ అయ్యి వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉబ్బసం ఉంటే శ్వాస తీసుకోవడానికి సహాయపడే, వెన్నెముకకు మద్దతునిచ్చే కండరాలు ఒత్తిడికి గురై బలహీనపడతాయి. ఇది వెన్నుపాముకి మద్దతు ఇచ్చే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. తద్వారా వెన్నునొప్పి సమస్య పెరుగుతుంది. ఈ సమస్యపై వైద్యులు ఏం చెబుతున్నారో? ఓ సారి తెలుసుకుందాం.

వెన్నునొప్పి, ఉబ్బసం మధ్య ముఖ్యమైన సంబంధం ఉందని చాలా మంది వైద్యులు పేర్కొంటున్నారు. అయితే రోగికి ఈ రెండు పరిస్థితులకు సంబంధం లేదని అనిపించవచ్చు. ఉబ్బసం అనేది వ్యక్తి భంగిమ శ్వాస విధానాలను ప్రభావితం చేస్తుంది. ఇది కండరాల అసమతుల్యత, వెనుక కండరాలలో ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఇది ఎగువ, మధ్య లేదా దిగువ వెనుక భాగంలో అసౌకర్యం, నొప్పిని కలిగిస్తుంది. అలాగే కొన్ని రకాల ఆస్తమా మందులు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది. ఇది వెన్నునొప్పి సమస్యను కూడా పెంచుతుంది. వెన్నునొప్పి సరిగ్గా శ్వాస తీసుకోవడం కష్టతరం చేయడం ద్వారా ఆస్తమా లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.

ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ కావాల్సిందే

ఆస్తమా అనేది శ్వాసనాళాల్లో వాపు వల్ల సంభవిస్తుంది, అయితే వెన్నునొప్పి కండరాలలో వాపు వల్ల సంభవించవచ్చు, వెన్నునొప్పి, ఉబ్బసం సమస్యకు సమర్థవంతంగా వైద్యం చేయడానికి రోగికి అవగాహన, శ్రద్ధ రెండూ అవసరం. ఆస్తమా చికిత్స చేయడానికి మందులు ఎంత అవసరమో? జీవనశైలి మార్పులు కూడా అంతే అవసరం అవుతాయి. వ్యాయామం, బరువు నిర్వహణ, ఒత్తిడి తగ్గించే వివిధ పద్ధతుల ద్వారా ఆస్తమాను అదుపులో ఉంచుకోవచ్చు. ముఖ్యంగా భుజాలు, మెడ, దిగువ వీపులో తీవ్రమైన నొప్పి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆస్తమాకు సంబంధించిన వెన్నునొప్పి ఉన్నప్పుడు ఛాతీ నొప్పి, యాసిడ్ రిఫ్లక్స్, అలసట వంటి లక్షణాలను కూడా అనుభవించే అవకాశం ఉంది. 

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..