World Asthma Day 2023: ఆస్తమా రోగులు వ్యాయామం చేయకూడదా? చేస్తే ఏమవుతుంది? నిపుణులు చెబుతున్నదిదే..
ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి దాదాపు 262 మిలియన్ మంది ప్రజలు ఆస్తమా బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. వీరిలో 4,55,000 మంది మరణిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఆస్తమాను నివారించడానికి రోగులు సరైన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు జీవన శైలి మార్చుకోవడం ద్వారా ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకవచ్చు.

ఆస్తమా.. ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతున్న వ్యాధి. ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఈ వ్యాధి సోకుతోంది. చాలా వరకూ వ్యక్తుల కుటుంబ చరిత్రను బట్టి ఆస్తమా వస్తుంది. అంటే కుటుంబంలో పెద్దవారికి ఆస్తమా ఉంటే వారి సంతానానికి, వారసులకు వచ్చే అవకాశం ఎక్కువ. ప్రధానంగా ఇది ఐదేళ్ల ఉన్న పిల్లల్లో కనిపిస్తుంది. ఆ వయసు నుంచి ఆస్తమా లక్షణాలు కనిపిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి దాదాపు 262 మిలియన్ మంది ప్రజలు ఆస్తమా బారిన పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. వీరిలో 4,55,000 మంది మరణిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఆస్తమాను నివారించడానికి రోగులు సరైన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు జీవన శైలి మార్చుకోవడం ద్వారా ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకవచ్చు. అయితే ఆస్తమా రోగులకు చాలా భయాలు వెంటాడుతుంటాయి. వాటిల్లో ప్రధానమైనది ఆరుబయట ఉండటం. దీనివల్ల గుండె, ఊపరితిత్తులు ఇబ్బంది పడతాయని వారు నమ్ముతారు. అలాగే వ్యాయామం చేయడంపై కూడా గందరగోళం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆస్తమా రోగులు వ్యాయామం చేస్తే ఏమవుతుంది? అసలు ఆస్తమా రోగులు వ్యాయామం చేయొచ్చా? చేస్తే ఎటువంటి వ్యాయామాలు చేయాలి? దీనిపై నిపుణులు చెబుతున్న వివరాలు ఇప్పుడు చూద్దాం..
కారణం తెలుసుకోవాలి..
ఒక వ్యక్తి అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందంటే అది దుమ్ము, పొగ లేదా పుప్పొడి వంటి కారణాల వల్ల కావచ్చు. ఇవి శ్వాసనాళాలపై ఒత్తడి పెంచుతాయి. అందువల్ల శ్వాసలో గురక, దగ్గు, ఊపిరితిత్తులలో శ్లేష్మం ఏర్పడటంతో పాటు అకస్మాత్తుగా శ్వాస ఆడకపోవడాన్ని కలిగిస్తుంది. సాధారణంగా డస్ట్ అలెర్జీ ఉన్నవారిలో ఈ ప్రమాదం మరింత అధికంగా ఉంటుంది. శ్వాస ఆడకపోవడానికి కారణాలపై సరైన అవగాహన ఉండాలి. మధుమేహం, హైపర్‌టెన్షన్ వంటి ఇతర క్లిష్టమైన వ్యాధుల కేసుల మాదిరిగానే, పైన పేర్కొన్న కారణాలను అర్థం చేసుకోవడం జాగ్రత్తలు పాటించడం ద్వారా మనం ఆస్తమా పరిస్థితిని కూడా నిర్వహించవచ్చు. ఉబ్బసం ఉన్నవారు సాధారణ మందులు, శ్వాస సమస్యలను అధ్యయనం చేయడం ద్వారా సాధారణ జీవితాన్ని గడపవచ్చు.
వ్యాయామం మేలే..
- సాధారణ వ్యాయామాలు చేయాలనుకునే ఆస్తమా రోగులకు ఎటువంటి క్రియాశీల ప్రమాదం ఉండదు.
- చురుకైన జీవనశైలి ఊపిరితిత్తుల బలాన్ని మెరుగుపరుస్తుంది. ఆస్తమా ఉన్నవారి శారీరక శ్రమ, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
- మీరు చేసే చిన్న చిన్న వ్యాయామాల వల్ల శ్వాస కోసం ఉపయోగించే కండరాలను బలోపేతం అవుతాయి. తద్వారా ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది.
- శ్వాసనాళాల్లో మంటను తగ్గిస్తుంది.
- ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది.
- శరీర ఫిట్‌నెస్ పెరిగితే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు.
ఏ వ్యాయామాలు చేయాలి..
ఒక వ్యక్తి తగినంత నియంత్రణతో ఉబ్బసం కోసం సాధారణ మందులు తీసుకుంటుంటే వ్యాయామం ప్రాథమికంగా ప్రయోజనకరంగా ఉంటుంది; ఇది ఉబ్బసం లక్షణాలను వేగవంతం చేయదు లేదా తీవ్రతరం చేయదు. రోగి పరిస్థితిని బట్టి ఏ వ్యాయామం చేయాలి? ఎంత స్థాయిలో, ఎంత తీవ్రతతో చేయాలి? అనే విషయాన్ని నిర్ధారించాలి. అందుకోసం తప్పనిసరిగా మీ వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.



(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..