Overcome Laziness: సోమరితనంతో ఇబ్బందిని పడుతున్నారా.. జపాన్ వాసులు పాటించే ఈ నియమాలను జీవితంలో అప్లై చేసి చూడండి..
ఈ రోజు చేయాల్సిన పనిని రేపటి కోసం వాయిదా వేస్తూ ఉండే వ్యక్తులు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అదే సమయంలో రేపు చేయాల్సిన పనిని ఈ రోజే పూర్తి చేస్తి విజయాన్ని సాధించిన కొందరు వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రపంచంలో అతి తక్కువ సోమరితనం ఉన్న వ్యక్తులు జపాన్ లో ఉంటారు. జపాన్ ప్రజలు తమ పనిని రేపటి చేద్దామని వాయిదా వేయరు. ఈరోజే పూర్తి చేయాలని ఆలోచిస్తారు. ఈ చిన్న విషయమే జపాన్‌ను నేడు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టింది.
ప్రాచీన కాలం నుండి మనిషిలోని దుర్గుణాల్లో సోమరితనం లేదా బద్ధకం ఒక లక్షణం అని.. ఇది మనిషిలోని ప్రతికూల లక్షణం అని పేర్కొన్నారు. సోమరితనం ఉన్నవారు ఏదైనా పనిని చేయాలంటే.. వాయిదా పద్దతిని ఎంచుకుంటారు.. ఈ రోజు ఇప్పుడే చేయాల్సిన పనిని ఇంకా సమయం ఉంది కదా.. సమయం అయ్యేలోపు చేద్దాం అంటూ వాయిదా వేస్తూ ఉంటారు.. అయితే ఇలాంటి వ్యక్తు ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ కనిపించినా.. జపాన్ దేశస్థులు మాత్రం ఇందుకు మిహనహాయింపు అని చెప్పవచ్చు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబు దాడికి గురై అస్తవ్యస్తమైన ఆర్ధికపరిస్థితిని అక్కడ ప్రజలు మళ్ళీ కొన్నేళ్లలోనే గాడిన పెట్టుకున్నారంటే.. వారి కష్టపడే తత్వం గురించి అర్ధం చేసుకోవచ్చు. అవును జపాన్ వాసులు రేపటి పనిని కూడా ఈ రోజే ఇప్పుడే చేస్తామని అంటారట.
వాస్తవంగా ప్రతి మనిషికి ఉండేది 24గంటలే.. అయితే కొందరు జీవితంలో ఏ లక్ష్యం లేకుండా బద్దకంగా జీవిస్తూ ఉంటారు. మరికొందరు వ్యక్తులు అద్భుతమైన ఆలోచనలో జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యాన్ని సాధించాలనే తపనతో ఉంటారు. అయితే సోమరితనంతో ఇబ్బంది పడుతూ..దానిని అధిగమించాలనే ఆలోచన మీకుంటే.. ఆ బద్ధకాన్ని సోమరితనాన్ని ఎలా అధిగమించాలో .. అదీ జపానీస్ ప్రజల ఆలోచనాతీరు ఎలా ఉంటుందో ఈ రోజు తెలుసుకుందాం..
సోమరితనం మనిషికి అతి పెద్ద శత్రువు అని కొందరు పండితులు చెప్పారు. ఈ రోజు చేయాల్సిన పనిని రేపటి కోసం వాయిదా వేస్తూ ఉండే వ్యక్తులు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అదే సమయంలో రేపు చేయాల్సిన పనిని ఈ రోజే పూర్తి చేస్తి విజయాన్ని సాధించిన కొందరు వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రపంచంలో అతి తక్కువ సోమరితనం ఉన్న వ్యక్తులు జపాన్ లో ఉంటారు. జపాన్ ప్రజలు తమ పనిని రేపటి చేద్దామని వాయిదా వేయరు. ఈరోజే పూర్తి చేయాలని ఆలోచిస్తారు. ఈ చిన్న విషయమే జపాన్‌ను నేడు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టింది.
- లక్ష్యం లేదా ఆర్ట్ ఆఫ్ లివింగ్: జీవితంలో మీ లక్ష్యాన్ని నిర్ధేశించుకోండి. ప్రతి ఉదయం మేల్కొనే ముందు ఆ రోజు చేయాల్సిన పనులను నిర్ణయించుకోండి. బలాలు, అభిరుచులు, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా ఉండేదాన్ని ఎంచుకోండి. ఇదే జీవితానికి అర్థాన్ని ఇస్తుంది. లక్ష్యం లేని మనిషి జీవితంలో సంతోషం దూరంగా ఉంటుంది.
- చిన్న చిన్న స్టెప్స్ లేదా లక్ష్యంగా దిశగా మెల్లగా అడుగు: మీరు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అందుకునేలా ప్రతిరోజూ చిన్న చిన్నగా చేసే విధంగా దృష్టి పెట్టండి. ప్రతిదీ ఒకేసారి చేయనవసరం లేదు.. కొద్దికొద్దిగా పురోగతి సాధించడమే లక్ష్యంగా పెట్టుకోండి. నిదానంగా మీలో లోపలకు చిన్న చిన్న మెరుగులు దిద్దుకుంటూ ముందుకు సాగుతుంటే ఏదో ఒకరోజు గొప్ప వ్యక్తి అవుతారు.
- టైం మేనేజ్మెంట్ లేదా పని మధ్య విశ్రాంతి : పని మొదలు పెట్టినప్పుడు టైం మేనేజ్మెంట్ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఏదైనా పని మొదలు పెడితే.. 25 నిమిషాలు పని చేయండి.. తర్వాత 5 విరామం తీసుకోండి.. మళ్ళీ పనిని మొదలు పెట్టండి.. ఇలా పునరావృతం చేయండి. ఇలా పని చేస్తూ విశ్రాంతి తీసుకోవడం అనే ప్రక్రియ అనేది.. మీరు ఏకాగ్రతతో ఉండడానికి, అలసటను నివారించడానికి సహాయపడుతుంది.టైం మేనేజ్మెంట్ అనేది గేమ్-చేంజర్ అని చెప్పవచ్చు. పని మధ్య విశ్రాంతి అవసరం.. ఇలా విశ్రాంతి తీసుకుంటూ తర్వాత పని చేస్తూ ఉంటె.. ఎంత పని అయినా ఈజీగా చేస్తారు.
- హర హచి బు అంటే జపనీస్ డైట్ ప్లాన్ : అంటే కడుపు నిండా తినకుండా కేవలం మీ కడుపుని 80 శాతం ఆహారంతో మాత్రమే నింపుకోండి అంటున్నారు జపాన్ వాసులు. ఆహారాన్ని ఆస్వాదిస్తూ, నెమ్మది నెమ్మిదిగా 10 కావాల్సిన చోట 8 మాత్రమే తినే పద్దతిని జపాన్ వాసులు ఇష్టపడతారు. ఇలా చేయడం వలన మీరు భోజనం తర్వాత భుక్తాయాసంతో ప్యాంటును విప్పాల్సిన అవసరం ఏర్పడదు. అతిగా తిని లావు అవ్వి ఆపసోపాలు పడడం కంటే.. తక్కువ తిని ఆరోగ్యంగా ఉండడం మేలు. ఎక్కువ తింటే ఎక్కువ నిద్ర వస్తుంది. ఎక్కువ నిద్రపోతే పనిని పూర్తి చేయలేమని జపాన్ వాసులు విశ్వసిస్తారు.
- షోషిన్ అంటే కొత్త విషయాలు నేర్చుకోవడపై ఆసక్తి: ఏదైనా పనిని మొదలు పెట్టె ముందు అన్నీ తెలుసుకోవాలని ఆలోచించకండి.. నిరంతర విద్యార్థి అనే మనస్తత్వంతో పనులను చేయడం మొదలు పెట్టండి.. కొత్త విషయాలను నేర్చుకోవడానికి.. పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే విజయం మీ సొంతం. ప్రపంచంలో ఎవరూ ఒక్కరోజులో గొప్పవారు కాలేదు. ఏ పని చేయడానికైనా సమయం పడుతుంది.. ఆ సమయం కోసం వేచి ఉండటం అవసరం.
- వాబి-సబి అంటే అస్థిరత – అసంపూర్ణం : ప్రతి చిన్న విషయాలకు ఒత్తిడికి గురయ్యే బదులు.. ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టండి. సరళతలో ఉన్న అందాన్ని ఆస్వాధించండి. పరిపూర్ణత కంటే పూర్తి చేయడం ఉత్తమం.. కనుక ముందు సాగే విధమా చర్యలు తీసుకోవాలి. ఎప్పుడు గొప్పవారం అవుతాం అనే విషయంపై దృష్టి పెట్టవద్దు. ఈ రోజు మీరు మీరు ఎంత బాగా పనిచేశారో అనే విషయం గురించి మాత్రమే ఆలోచించండి.
- ఫారెస్ట్ బాత్ అంటే అడవి స్నానం: అంటే మనిషి ప్రకృతికి దగ్గరగా ప్రకృతిలో సమయం గడపండి! ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. వీలు కాకపోతే పార్కులో నడవండి, స్వచ్ఛమైన గాలిని పీల్చుకోండి. ప్రకృతి మిమ్మల్ని రీఛార్జ్ చేస్తుంది. ఇలాంటి బలం భవనాల్లో ఆధునిక సౌకర్యాల్లో లభ్యం కాదు.
- కకీబో అంటే ఇంటి పద్దు: ఇంటి ఖర్చుల నిమిత్తం బడ్జెట్ తయారు చేసి దానికి కట్టుబడి ఉండండి. ఇలా ఆర్ధికంగా ముందస్తు చర్యలు తీసుకుంటే.. తక్కువ ఒత్తిడికి గురవుతారు. అంతేకాదు ఇతర లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకోవడానికి ప్రేరణ పొందుతారు.
జపాన్ వాసులు జీవితంలో పాటించే ఈ విషయాలు ఎవరైనా సరే తమ జీవితంలో పాటించడం మొదలు పెడితే.. సోమరితనం దగ్గరికి చేరదు. అంతేకాదు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవితాన్ని గడుపుతారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..