వీరికి మెంతులు విషంతో సమానం.. పొరబాటున తిన్నారో బండి షెడ్డుకే!

29 December 2024

TV9 Telugu

TV9 Telugu

చూడ్డానికి చిన్నగా ఉన్నా, మెంతులతో ఆరోగ్యానికి చాలా లాభమని చెబుతున్నాయి పరిశోధనలు. ముఖ్యంగా నానబెట్టుకుని తీసుకుంటే ఫలితాలు అధికంగా ఉంటాయట

TV9 Telugu

నానబెట్టిన మెంతుల్ని ఉదయాన్నే తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. వీటిల్లోని పీచు పొట్ట ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియా పెరగడానికి సాయపడుతుంది

TV9 Telugu

మెంతులుల్లోని పీచు, ఆల్కలాయిడ్స్‌ మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి సాయపడతాయి. మధుమేహం రిస్కు ఎక్కువగా ఉన్నవాళ్లు, టైప్‌-2 డయాబెటిస్‌ బాధితులు.. నానబెట్టిన మెంతుల్ని ఉదయాన్నే తీసుకుంటే రోజంతా రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా చూస్తాయి

TV9 Telugu

మెంతి గింజల్లో విటమిన్ బి6, సి, ప్రొటీన్, ఐరన్, ప్రొటీన్, ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు ఇందులో లభిస్తాయి. అయితే కొందరికి మెంతి గింజలు తినడం వల్ల తీవ్ర హానికలుగుతుంది

TV9 Telugu

మెంతి గింజలను ఎవరు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.. నిపుణుల అభిప్రాయం ప్రకారం మెంతి గింజలు ఎక్కువగా తినడం వల్ల వాంతులు, విరేచనాలు, ఉబ్బరం, తల తిరగడం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి

TV9 Telugu

ప్రెగ్నెన్సీ సమయంలో మెంతి గింజలను ఎక్కువ మోతాదులో తీసుకుంటే కడుపులోని శిశువుకు హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే గర్భధారణ సమయంలో తినవద్దంటూ నిపుణులుచెబుతున్నారు

TV9 Telugu

మీరు బ్లడ్ ప్రెజర్ మెడిసిన్ తీసుకుంటుంటే, మెంతి గింజలను తీసుకోకపోవడమే మంచిది. అధిక రక్తపోటు వీటిని తీసుకుంటే బ్లడ్ ప్రెజర్ మరింత పెరిగే అవకాశం ఉంది

TV9 Telugu

అలాగే కొంతమందికి మెంతులు తినడం వల్ల వికారం, తలనొప్పి, ముక్కు దిబ్బడ, ముఖం వాపు, దగ్గు, గురక వంటి ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయి. వీరు కూడా మెంతులకు దూరంగా ఉండాలి