Telangana News: ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం.. ఒకే రోజు ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య
ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఒకే రోజు ఇద్దరు కానిస్టేబుల్స్ ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ కలచివేసింది. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఓకే రోజు ఆత్మహత్య చేసుకోవడంతో జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాలకుంట కాలనీలో ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓకే రోజు ఇద్దరు కానిస్టేబుల్ల్ ఆత్మహత్య చేసుకోవడం పోలీస్ వర్గాలను షాక్‌కి గురి చేశాయి. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు ఓకే రోజు ఆత్మహత్య చేసుకోవడంతో జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాలకుంట కాలనీలో ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. భార్య మానసతో పాటు తన ఇద్దరు పిల్లలు యశ్వంత్ (11,) ఆశిరిత్ (9) పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు. అనంతరం తాను రూమ్‌లోకి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు బాలకృష్ణ.. ఈ ఘటనలో భార్య మానసతో పాటు, ఇద్దరు పిల్లలు బయటపడ్డారు. ప్రస్తుతం ఇద్దరికీ సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ జరుగుతుంది. కానిస్టేబుల్ బాలకృష్ణ అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు తెలిపారు. ఇటీవలే కొత్త ఇల్లు కొనుగోలు చేయగా 14 లక్షల అప్పు అయ్యిందని, మిగతా అప్పులు కూడా పెద్ద మొత్తంలో ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ దొరికినట్లు సమాచారం.
కాగా తనతో పాటు తన కుటుంబం మొత్తం చనిపోవాలని భావించాడు కానిస్టేబుల్ బాలకృష్ణ.. అందుకే ముందుగా పురుగుల మందు తెచ్చి తన భార్యతో పాటు, ఇద్దరు పిల్లలకు కూడా మంచినీళ్లలో పోసి ఇచ్చాడు. అయితే ఆ పురుగుల మందు పనిచేయలేదని గ్రహించిన కానిస్టేబుల్ బాలకృష్ణ ఓ రూమ్‌లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలకృష్ణ ప్రస్తుతం సిరిసిల్ల జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. బాలకృష్ణ సొంత గ్రామం సిరిసిల్ల జిల్లా లింగన్నపేట.. 17వ బెటాలియన్ చెందిన AR కానిస్టేబుల్ బాలకృష్ణ మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు.. ఇక మరో కానిస్టేబుల్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ క్వాటర్స్ ఆవరణలో హెడ్ కానిస్టేబుల్ సాయి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన సాయి కుమార్ కి, సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన లక్ష్మితో వివాహం జరగడంతో మెదక్ జిల్లాలోని నర్సాపూర్ ప్రాంతంలో సుదీర్ఘ కాలం పనిచేయడంతో నర్సాపూర్ పట్టణంలో ఇల్లు నిర్మించుకొని గత కొన్ని సంవత్సరాలుగా నర్సాపూర్‌లో నివసిస్తున్నాడు. కాగా హెడ్ కానిస్టేబుల్ సాయి నర్సాపూర్‌లో చాలా మందికి వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు. ఈ నేపథ్యంలోనే నర్సాపూర్‌లో ఒక హోటల్ నడిపిస్తున్న మహిళకు,హెడ్ కానిస్టేబుల్ సాయికి పరిచయం ఏర్పడి అది కాస్తా వివాహేతర సంబంధనికి దారి తీసింది. ఈనేపథ్యంలోనే ఆ మహిళకు కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చాడని, తిరిగి తన డబ్బులు తనకు కావాలని అడగగా ఆ మహిళ భర్త, హెడ్ కానిస్టేబుల్ సాయి తమను వేధిస్తున్నాడని నర్సాపూర్ పోలీసులకు పిర్యాదు చేసినట్లు సమాచారం. దీనితో తన పరువు ఎక్కడ పోతుందో అనే అవమానంతో ఈరోజు ఉదయం వాకింగ్ వెళ్లి వచ్చి, తన ఇంట్లో వారికి ఫోన్ చేసి చెట్టుకి హెడ్ కానిస్టేబుల్ సాయి ఉరి వేసుకున్నడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి