Sandhya theatre stampede: పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం ఆన్సర్.. ఆరు పేజీల లేఖ..

ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీతేజ్ కొన్ని రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబానికి అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ రూ.2 కోట్లు సాయం ప్రకటించారు.

Sandhya theatre stampede: పోలీసుల నోటీసులకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం ఆన్సర్.. ఆరు పేజీల లేఖ..
Sandhya Theater
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 29, 2024 | 5:57 PM

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై థియేటర్ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు పంపిన నోటీసులకు సంధ్య థియేటర్‌ యాజమాన్యం సమాధానం ఇచ్చింది. సంధ్య థియేటర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని మొత్తం ఆరు పేజీల లేఖను పంపింది థియేటర్‌ యాజమాన్యం. “డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షోకు మొత్తం 80 మంది థియేటర్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. 4,5తేదీల్లో హాల్‌ను మైత్రి మూవీస్‌ బుక్‌ చేసుకుంది. వాహనాల కోసం థియేటర్‌లో ప్రత్యేక పార్కింగ్‌ ఉంది. గత 45 ఏళ్లుగా థియేటర్‌ను రన్‌ చేస్తున్నాము. గతంలోనూ హీరోలు థియేటర్‌కు వచ్చారు. కానీ ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు” అంటూ 6 పేజీల లేఖను సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకు పంపింది.

డిసెంబర్ 4న పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో ప్రదర్శించింది సంధ్య థియేటర్ యాజమాన్యం. ఈ క్రమంలోనే థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయగా.. మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. బాధిత కుటుంబానికి ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షలు, హీరో అల్లు అర్జున్ రూ.కోటి, దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు అందించారు. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ.25 లక్షలు సాయం అందించారు.

అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా పుష్ప 2. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా.. ఇందులో రష్మిక మందన్నా, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది. అయితే డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.