క్యారెట్ తింటే కంటిచూపు మెరుగుపడుతుందని తెలియని పిల్లలుండరు.. నిజానికి క్యారెట్లతో ఆ ఒక్కటే కాదు.. ఇంకెన్నో లాభాలున్నాయి
TV9 Telugu
కెరొటిన్, పీచు, పొటాషియం, కాల్షియం కెలొరీలు, ప్రొటీన్లు, పిండిపదార్థాలు, విటమిన్లతో ఇది మంచి పోషకాహారం. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు వ్యాధి నిరోధకంగా పనిచేస్తాయి. ఇవి రక్తంలో చెక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. రక్తపోటును, గుండె జబ్బులను నిరోధిస్తాయి
TV9 Telugu
జీర్ణ ప్రక్రియలో అపసవ్యతలుంటే తగ్గిపోతాయి. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతాయి. క్యారెట్లు తినేవారిలో ఎముకలు పటిష్టంగా ఉంటాయి. ఊబకాయం బారిన పడనివ్వవు. క్యారెట్ నమలడం నోటికి మంచి వ్యాయామం
TV9 Telugu
అయితే క్యారెట్లను పచ్చిగానే కాకుండా రకరకాల వంటకాల్లోనూ వినియోగిస్తుంటాం. ముఖ్యంగా క్యారెట్‌తో చేసిన హల్వా బలేగా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో చాలా ఇళ్లలో ఎక్కువగా తయారుచేస్తారు
TV9 Telugu
పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే క్యారెట్ హల్వాతో కొంత ప్రమాదం కూడా ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ హల్వాను ఎక్కువ చక్కెర, నెయ్యితో తయారు చేస్తారు. అంటే తీపికాస్త జాస్తిగానే ఉంటుంది
TV9 Telugu
అందువల్ల మధుమేహ రోగులు దీనిని తినకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. ఫలితంగా లేనిపోని చిక్కుల్లోపడాల్సి వస్తుంది
TV9 Telugu
అలాగే ఊబకాయంతో బాధపడేవారు కూడా దీనికి దూరంగా ఉండాలి. బరువు తగ్గేవారు, డైలో ఉన్నవారు కూడా క్యారెట్ హల్వా తినకూడదు. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారికి ఇది మరింత హానికరం
TV9 Telugu
ఎందుకంటే ఇందులో కేలరీలు, కొవ్వు అధికంగా ఉంటుంది. అంతేకాకుండా కడుపులో గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యతో బాధపడేవారు కూడా క్యారెట్ హల్వా అస్సలు తినకూడదు