Termite Control Tips: మీ ఇంట్లో కూడా చెదపురుగులు ఉన్నాయా? సహజ పద్ధతుల్లో ఇలా నివారించండి
మీ ఇంట్లో చెక్క వస్తువులకు పట్టిన చెద పురుగులు ఓ పట్టాన వదలట్లేదా? అయితే మీ సమస్యను చిటికెలో మాయం చేయొచ్చు. ఎలాగంటే ముందుగా ఓ స్ప్రే బాటిల్ తీసుకుని అందులో ఈ రెండు పదార్ధాలు సమపాళ్లలో కలిపి చెదలు ఉన్నచోట పిచికారీ చేస్తేసరి.. కణాల్లో మాయం అవుతాయి..
దాదాపు అందరి ఇళ్లలోనూ చెక్క సామాన్లు ఉంటాయి. కానీ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇంటి తలుపులు, కిటికీలతో సహా ఫర్నిచర్ పై చెదలు పట్టడం సాధారణం. చెదపురుగులు ఫర్నిచర్‌లోకి ప్రవేశించి కొద్ది కొద్దిగా పాడుచేస్తాయి. మీ ఇంటిలో కూడా చెదపురుగులు ఉంటే వాటిని వదిలించుకోవడానికి ఈ కింది సహజ చిట్కాలు పాటించండి.
నిమ్మరసం – వెనిగర్
ఇంట్లో చెదపురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే రెండు టీ స్పూన్ల వెనిగర్‌కు ఒక స్పూను నిమ్మరసం వేసి నీళ్లు పోసి బాగా కలపాలి. చెదపురుగులు ఉన్న ప్రాంతంలో పిచికారీ చేయడం వల్ల చెదపురుగులు నశిస్తాయి.
వేప నూనె
వేపనూనెకు చెదపురుగులను నాశనం చేసే గుణం ఉంటుంది. చెదపురుగులు ఉన్న ప్రదేశంలో ఈ వేపనూనెను స్ప్రే చేయాలి. లేదా ఒక గుడ్డను ముంచి ఆ ప్రదేశంలో తుడవండి చెదపురుగులు పూర్తిగా తొలగిపోతాయి.
వేప – వెల్లుల్లి
వెల్లుల్లి, వేప స్ప్రే ద్వారా గోడలు, ఫర్నీచర్‌కు అతుక్కున్న చెదపురుగులను వదిలించుకోవచ్చు. కాబట్టి 8 నుంచి 9 వెల్లుల్లి రెబ్బల రసాన్ని తీసి అందులో వేపనూనె కలిపి పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది.
సిట్రస్ ఆయిల్
సిట్రస్ ఆయిల్ కూడా చెదపురుగులను తొలగించడంలో బలేగా పనిచేస్తుంది. చెదపురుగులు ఉన్న చోట ఈ నూనెను పిచికారీ చేస్తే చెదపురుగులు పూర్తిగా తొలగిపోతాయి.
ఉప్పు
ఇంట్లో చెదపురుగులు కనిపిస్తే, వెంటనే ఆ ప్రాంతాల్లో ఉప్పుతో చల్లుకోవాలి. లేదా ఆ ప్రాంతాన్ని ఉప్పునీటితో తుడవాలి. ఇలా చేసినా చెద పురుగుల బెడద తొలగిపోతుంది.
బోరిక్ యాసిడ్
చెదపురుగు సోకిన ప్రదేశంలో బోరిక్ యాసిడ్ పౌడర్ స్ప్రే చేయడం వల్ల ఈ చెదపురుగు సమస్య నుంచి బయటపడవచ్చు.
లవంగాలు
చెదపురుగులను నివారించడంలో లవంగాలు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి లవంగాలను తీసుకుని నీటిలో బాగా మరిగించాలి. నీరు చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్‌లో వేసి చెదపురుగులు ఉన్న చోట పిచికారీ చేయాలి. ఇలా చేస్తే లవంగాల వాసన చెదపురుగులను త్వరగా చంపేస్తుంది.