Winter Season: చలికాలంలో రోజుకెన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా..? చాలా మంది చేసే పొరబాటు అదే

శీతాకాలంలో చల్లని వాతావరణం కారణంగా దాహంగా అనిపించదు. దీంతో చాలా మంది తగినంతగా నీళ్లు తాగరు. ఇలా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి, ఈ కాలంలో

Winter Season: చలికాలంలో రోజుకెన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా..? చాలా మంది చేసే పొరబాటు అదే
నేట జీవనశైలి కారణంగా అధిక మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. దీని కారణంగా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ఎన్నో పాట్లు పడుతున్నారు. కొందరు జిమ్‌కి వెళ్లి వర్కవుట్ చేస్తే.. మరికొందరు ఇంట్లోనే బరువు తగ్గడానికి పలు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలా ఇంట్లోనే సులువుగా బరువు తగ్గే మార్గాల్లో ఒకటి తాగునీరు. అవును.. చాలా మంది నీరు త్రాగడం వల్ల బరువు తగ్గుతారని, కొవ్వు కరిగిపోతుందని చాలా మంది నమ్ముతుంటారు. దీనిలో నిజమెంతో హార్వర్డ్ నిపుణులు మాటల్లో మీకోసం..
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 29, 2024 | 1:44 PM

చలికాలం మొదలైంది. చలిగాలుల కారణంగా దాహంగా అనిపించదు. దీంతో చాలా మంది నీళ్లు తాగాల్సిన అవసరం లేదని అనుకుంటారు. కానీ శీతాకాలంలో కూడా శరీరానికి నీరు చాలా అవసరం. శరీరంలో నీటిశాతం తగ్గిపోతే ఏదో ఒక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుచేత చలి కాలంలో తీసుకునే ఆహారం నుంచి మనం తాగే నీటి పరిమాణం వరకు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.

శీతాకాలంలో ఒక వ్యక్తి ఎన్ని గ్లాసుల నీరు తాగాలి?

ఉదయం నుంచి రాత్రి వరకు రోజంతా నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. చలికాలంలో దాహం వేయకపోయినా రోజుకు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలి. శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పురుషులు రోజుకు 10 నుంచి 14 గ్లాసుల నీరు, మహిళలు 8 నుంచి 12 గ్లాసుల నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా నీళ్లకు బదులు జ్యూస్, పాలు, టీ, కొబ్బరి నీళ్లు కూడా తాగవచ్చు. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుందని, తద్వారా రకరకాల అనారోగ్య సమస్యలు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు.

చలికాలంలో తక్కువ నీరు తాగితే వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే

ఊబకాయం సమస్య

తక్కువ నీరు తాగడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. మనం రోజుకు ఎంత ఆహారం తీసుకుంటామో.. దానిని బట్టి శరీరానికి అవసరమైనంత నీరు తాగాలి. లేదంటే తినే ఆహారం జీర్ణం కాదు. ఇది స్థూలకాయానికి దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

దుర్వాసన

తక్కువ నీరు త్రాగే అలవాటు వల్ల నోరు పొడిబారుతుంది. దీంతో నోటిలో బ్యాక్టీరియా పేరుకుపోతుంది. నోటి నుండి దుర్వాసన కూడా వస్తుంది. అంతేకాకుండా శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు చెమట, మూత్రవిసర్జన తగ్గుతుంది. దీని కారణంగా విష పదార్ధాలు శరీరం నుండి బయటకు వెళ్ళదు. ఇది మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

తలనొప్పి

నీటి కొరత వల్ల మెదడు కణాలు తాత్కాలికంగా తగ్గిపోవడం వల్ల తలనొప్పి సమస్యలు వస్తాయి. శరీరానికి సరిపడా నీరు లేకపోవడం వల్ల కడుపులో యాసిడ్ ఏర్పడటం పెరుగుతుంది. ఇది కడుపులో గ్యాస్ ఏర్పడటానికి దారితీస్తుంది. మలబద్ధకంతో సహా గుండెల్లో మంట వంటి సమస్యలు సంభవించవచ్చు.

అలసట, పొడిచర్మం

శరీరం చురుగ్గా పనిచేయడానికి నీరు చాలా అవసరం. శరీరంలో నీటి కొరత ఉంటే చిన్నపని చేసినా అలసటగా అనిపిస్తుంది. శరీరంలో నీరు లేకపోవడం వల్ల చర్మం పొడిబారడం, నల్లటి వలయాలు, దురద, ముడతలు వంటి సమస్యలు వస్తాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.