- Telugu News Photo Gallery These tricks are best for reducing joint pains during winter season, check details in Telugu
Joint Pains: చలి కాలంలో వచ్చే కీళ్ల నొప్పులు.. తగ్గాలంటే ఈ ట్రిక్స్ బెస్ట్!
వింటర్ సీజన్‌లో ఎంతో మందిని వేధించే సమస్యల్లో శరీర నొప్పులు కూడా ఒకటి. మరికొంత మందికి ఎక్కువగా కీళ్ల నొప్పులు వేధిస్తూ ఉంటాయి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల ఈ సమస్యలు వస్తాయి..
Updated on: Nov 29, 2024 | 12:47 PM

చలి కాలంలో అనేక ఇతర సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సీజన్‌లో ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎటాక్ చేస్తూ ఉంటాయి. అందులోనూ ప్రస్తుతం చలి తీవ్రత బాగా పెరిగింది. చలి తీవ్రత రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ఈ క్రమంలోనే ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో పాటు కీళ్ల నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో.. శరీరంలో కండరాలు అనేవి బిగుసుకుపోతాయి. దీంతో కీళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి.

కీళ్లు గట్టిపడిపోవడం నడిచేందుకు ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని రకాల చిట్కాలతో ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. వీలైనంతగా ఎండ ఇంట్లో పడేలా చూసుకోవాలి. దీంతో ఇంట్లో చల్లదనం తగ్గి వేడి పెరుగుతుంది. ఉదయం లేదా సాయంత్రం ఎండ శరీరంపై తగిలేలా చూసుకోవాలి.

చలి కాలంలో కాస్త వేడి వేడిగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. సూప్స్ వంటివి తీసుకోవడం వల్ల కండరాలు అనేవి రిలీఫ్‌గా ఉంటాయి. సల్ఫర్, క్యాల్సియం ఉండే ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. ఇవి కీళ్ల నొప్పులు రాకుండా చేస్తుంది.

అదే విధంగా నీటిని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దీంతో కండరాలు కూడా ఫ్రీగా ఉంటాయి. శరీరంలో నీటి శాతం తగ్గినా కీళ్ల నొప్పులు వస్తాయి. జాయింట్ పెయిన్స్ బాగా ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యుల్ని సంప్రదించాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




