Cooking Oil: ఏ నూనె ఆరోగ్యానికి మంచిదో మీకు తెలుసా..? ఈ రకమైన నూనెలనే ఎల్లప్పుడూ వినియోగించాలి..
మనం ఆహారంలో ఉపయోగించే నూనె రకాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. నూనె రకం మాత్రమే కాదు, దాని పరిమాణం, ఉపయోగించే పద్ధతి కూడా ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి. ఆవనూనె, ఆలివ్, కొబ్బరి, అవకాడో వంటి అనేక నూనెలను వంటలో ఉపయోగిస్తారు. ఈ నూనెలన్నీ భిన్నమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఏ నూనెలు..

మనం ఆహారంలో ఉపయోగించే నూనె రకాన్ని బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. నూనె రకం మాత్రమే కాదు, దాని పరిమాణం, ఉపయోగించే పద్ధతి కూడా ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయి. ఆవనూనె, ఆలివ్, కొబ్బరి, అవకాడో వంటి అనేక నూనెలను వంటలో ఉపయోగిస్తారు. ఈ నూనెలన్నీ భిన్నమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఏ నూనెలు ఆరోగ్యానికి మంచివో, ఏది చెడ్డవో అనే విషయం గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే..
సన్‌ఫ్లవర్ ఆయిల్
పొద్దుతిరుగుడు నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఒక టీస్పూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో 28 శాతం విటమిన్ ఇ ఉంటుంది. దానికి రుచి ఉండదు కాబట్టి అందులో వండిన ఆహారానికి నూనె రుచి ఉండదు. ఇది అధిక వేడి వంటలలో ఉపయోగించబడుతుంది. ఈ నూనెలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు శరీరానికి అవసరం. అయినప్పటికీ, దీనిని అతిగా వాడటం వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ వస్తుంది.
ఆలివ్ ఆయిల్
చాలా మంది ఆలివ్ నూనెతో వండిన ఆహారం తీసుకోవడం ఆరోగ్యకరమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్‌తో వంట చేయడం ఇంకా మంచిది. ఎందుకంటే ఇది పూర్తిగా స్వచ్ఛమైనది. పచ్చి ఆలివ్ నూనె ప్రాసెస్ చేయకుండా, శుద్ధి చేయకుండా ఉంటుంది. అందుకే దాని నాణ్యత చాలా మంచిది. ఇందులో గుండెకు మేలు చేసే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు అధిక మొత్తంలో ఉంటాయి. ఆలివ్ నూనెతో తక్కువ లేదా మధ్యస్థ వేడి మీద వండుకోవాలి. ఈ నూనెను బేకింగ్, సలాడ్ డ్రెస్సింగ్ కోసం కూడా వినియోగించవచ్చు.
కొబ్బరి నూనె
కొబ్బరి నూనెలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. నిజానికి సంతృప్త కొవ్వు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయినప్పటికీ కొలెస్ట్రాల్‌ను తక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిదేనని కొందరు నిపుణులు భావిస్తున్నారు. మన శరీరానికి కూడా కొంత మొత్తంలో సంతృప్త కొవ్వు అవసరం. కాబట్టి ఈ నూనెను పొదుపుగా వాడుకోవచ్చు.
వెజిటబుల్ ఆయిల్
వెజిటబుల్ ఆయిల్ అంటే మొక్కల నుంచి తయారయ్యే నూనె అని అర్థం. వెజిటబుల్ ఆయిల్ ప్రయోజనాలు అది ఉపయోగించే వంట రకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. వెజిటబుల్ ఆయిల్‌ను ప్రాసెస్ చేస్తారు. కాబట్టి దాని రుచి, పోషక విలువలు తక్కువగా ఉంటాఇయి. ఇది శరీరంలో మంచి, చెడు కొలెస్ట్రాల్ మధ్య సమతుల్యతను నిర్వహిస్తుంది. కానీ అధిక వినియోగం శరీరానికి హాని కలిగిస్తుంది.
అవోకాడో ఆయిల్
అవోకాడో నూనె చాలా ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు నిపుణులు. ఇది వర్జిన్ ఆలివ్ ఆయిల్ లాగా శుద్ధి చేయబడదు. ఈ నూనెలో అధిక వేడిలో వండుతారు. అవోకాడో నూనె మీగడలా ఉంటుంది. అవకాడో నూనెలో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ ఉంటాయి. దీని ధర సాధారణ నూనెల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.
వేరుశెనగ నూనె
వేరుశెనగ నూనెతో వంట చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నూనెతో వండిన వంటకాలు చాలా రుచిగా కూడా ఉంటాయి. వేరుశెనగ నూనెలో మోనోశాచురేటెడ్ కొవ్వు అధికంగా ఉంటుంది.
ఆవనూనె
ఆవాల నూనెలో ఎక్కువ మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు సరైన మొత్తంలో ఉంటాయి. అన్ని కూరగాయల నూనెలలో కంటే ఆవ నూనెలో అతి తక్కువ మొత్తంల సంతృప్త కొవ్వు పదార్థం ఉంటుంది. ప్రాసెసింగ్ కారణంగా చాలామంది దీనిని ఆరోగ్యంగా పరిగణించరు.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.




