Fish Side Effects: మీకు తెలుసా.. చేపల కూర తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు తాగకూడదు! ఎందుకంటే..
చేపల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అనేక మంది చేపల పులుసు లేదా వేయించిన చేపలు తినడానికి ఇష్టపడతారు. అయితే చేపలను ఎక్కువగా తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరీ ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్న వారు చేపలను మరచిపోయి కూడా తినకూడదంటున్నారు..

చేపల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అనేక మంది చేపల పులుసు లేదా వేయించిన చేపలు తినడానికి ఇష్టపడతారు. అయితే చేపలను ఎక్కువగా తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరీ ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్న వారు చేపలను మరచిపోయి కూడా తినకూడదంటున్నారు. అధిక మొత్తంలో చేపలు తినడం వల్ల తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తుతాయి. అవేంటో తెలుసుకుందాం..
ప్రెగ్నెన్సీ మహిళలు చేపలు తినడం హానికరం. గర్భధారణ సమయంలో చేపలు అధికంగా తినకపోవడం బెటర్. ఎందుకంటే చేపలను ఎక్కువగా తినడం వల్ల పిండం, బిడ్డ ఎదుగుదలకు ఆటంకం కలుగుతుంది. చేపలను అధికంగా తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. చేపలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో పీసీబీ పెరిగిపోతుంది. ఫలితంగా మెదడు లేదా నాడీ వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల మతిమరుపు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి పరిమిత పరిమాణంలో చేపలను తీసుకోవాలని సూచిస్తున్నారు. కొన్ని రకాల చిన్న చేపలల్లో DDE అనే విష పదార్థం ఉంటుంది. ఇది మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. చిన్న చేపలను తిన్నప్పుడు, ఈ పదార్ధం నెమ్మదిగా కాలేయంలో చేరిపోతుంది. దీని కారణంగా ఊబకాయం, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చేపల అధిక వినియోగం మెదడు, నాడీ వ్యవస్థకు కూడా తీవ్ర నష్టం కలిగిస్తుంది. అందువల్లనే చేపలను అతిగా తినడం మానుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే మెర్క్యురీ, PCBలు తక్కువగా ఉండే చేపలను ఎంచుకోవాలి. పాదరసం ఉన్న చేపలను ఎక్కువగా తింటే, అది మీ ఆరోగ్యానికి ప్రాణాంతకం కావచ్చు. పాలు తాగిన తర్వాత కూడా చేపలు తినకూడదు. చేపలు, పాలు ఒకేసారి తినడం వల్ల శరీరంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. మీకు చేపలు తినడం ఇష్టమైతే, చేపలు తిన్న తర్వాత పాలు తాగకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి. చేపల తిన్న తర్వాత పాలు తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. చేపలు ఎక్కువగా తినడం వల్ల డిప్రెషన్ ఏర్పడుతుంది. అలాగే చిరాకు, జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే ఆల్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.




