Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heath Benefits of Neem: ఉదయాన్నే పరగడపున రెండు వేప ఆకులు తిన్నారంటే..

ఆయుర్వేద దృక్కోణంలో వేప ఆకులకు చాలా ముఖ్యమైన ప్రాథాన్యత ఉంది. వేప రుచి చేదుగా ఉన్నా, ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేప ఆకులు తింటే శరీరంలోని సగం వ్యాధులు నయమవుతాయి. ఖాళీ కడుపుతో వేప ఆకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

Heath Benefits of Neem: ఉదయాన్నే పరగడపున రెండు వేప ఆకులు తిన్నారంటే..
Neem Heath Benefits
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 05, 2023 | 8:40 PM

ఆయుర్వేద దృక్కోణంలో వేప ఆకులకు చాలా ముఖ్యమైన ప్రాథాన్యత ఉంది. వేప రుచి చేదుగా ఉన్నా, ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేప ఆకులు తింటే శరీరంలోని సగం వ్యాధులు నయమవుతాయి. ఖాళీ కడుపుతో వేప ఆకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

ఖాళీ కడుపుతో వేప ఆకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

రక్తంలో చక్కెర నియంత్రణ

అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగా దేశంలో మధుమేహ రోగుల సంఖ్య ఘనణీయంగా పెరిగిపోతోంది. మధుమేహంతో బాధపడేవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేప ఆకులను తినడం అలవాటు చేసుకోవాలి. ఫలితంగా రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది.

రక్తాన్ని శుభ్రంగా ఉంచుతుంది

వేపలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. రక్తాన్ని శుభ్రపరిచి రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. తద్వారా రక్తాన్ని నిర్విషీకరణ చేస్తుంది. మీ రక్తం పరిశుభ్రంగా ఉంటే రోగాలు దరిచేరవు.

ఇవి కూడా చదవండి

కడుపుకు మేలు చేస్తుంది

వేప మన చర్మానికే కాకుండా పొట్టకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు అసిడిటీకి మేలు చేస్తుంది. వేప ఆకులను నీళ్లలో వేసి నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే ఎసిడిటీ, కడుపు నొప్పి నయమవుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది

వేప ఆకులలో వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అంతే కాదు జలుబు వంటి వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగపడుతుంది.

వేప ఆకుల ఉపయోగాలు

సాధారణంగా, వేప ఆకులను పేస్ట్‌గా చేసి, రసం తీసి సేవిస్తారు. ఎల్లప్పుడూ తాజా వేప ఆకుల రసాన్ని మాత్రమే సేవించాలి. తాజా వేప ఆకులు అందుబాటులో లేకుంటే బాణలిలో వేప ఆకులను వేయించి చేతులతో మెత్తగా పొడి చేసుకోవాలి. అనంతరం వెల్లుల్లిపాయలు, ఆవాల నూనె కలిపి అన్నంలో కలిపి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

వేప ఆకులను తినేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

ఏదీ అతిగా తినడం మంచిది కాదు. కాబట్టి వేప ఆకులను ఒకేసారి ఎక్కువగా తినకండి. వేప ఆకులను ఎంత ఎక్కువగా తింటే అంత మంచి పోషకాలు లభిస్తాయని చాలా మంది అనుకుంటారు. అయితే, అది నిజం కాదు. ఎల్లప్పుడూ చిన్న మొత్తంలోనే తినాలి. ఇప్పటికే ఏదైనా వ్యాధితో బాధపడుతున్నవారు వేప ఆకులను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.