Rice water for Hair: జుట్టు విపరీతంగా రాలిపోతుందా..? బియ్యం కడిగిన నీళ్లతో ఇలా చేయండి..
అపురూపంగా చూసుకునే జుట్టు కళ్లముందే నిష్కారణంగా రాలిపోతుంటే ఆ బాధ వర్ణణాతీతం. మార్కెట్లో దొరికే ఎన్ని రకాల ఉత్పత్తులు వినియోగించినా పరిష్కారం దొరక్క సతమతమైపోతుంటారు. ఐతే అందుకు ఇంట్లోనే చక్కని పరిష్కారం ఉందంటున్నారు సౌందర్య నిపుణులు. బియ్యం కడిగిన నీళ్లతో జుట్టును కాపాడుకోవచ్చు. కాబట్టి బియ్యం నీళ్లను జుట్టుకు పట్టించడం వల్ల..
Updated on: Sep 05, 2023 | 8:46 PM

అపురూపంగా చూసుకునే జుట్టు కళ్లముందే నిష్కారణంగా రాలిపోతుంటే ఆ బాధ వర్ణణాతీతం. మార్కెట్లో దొరికే ఎన్ని రకాల ఉత్పత్తులు వినియోగించినా పరిష్కారం దొరక్క సతమతమైపోతుంటారు. ఐతే అందుకు ఇంట్లోనే చక్కని పరిష్కారం ఉందంటున్నారు సౌందర్య నిపుణులు.

బియ్యం కడిగిన నీళ్లతో జుట్టును కాపాడుకోవచ్చు. కాబట్టి బియ్యం నీళ్లను జుట్టుకు పట్టించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏవంటే.. బియ్యం నీటి ఒకటి కాదు, అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ నీరు జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి, జుట్టుకు మెరుపును అద్ది, మృదువుగా చేయడానికి సహాయపడుతుంది.

రైస్ వాటర్ హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలంటే.. ముందుగా బియ్యాన్ని బాగా కడగాలి. ఆ తర్వాత బియ్యాన్ని నీళ్లలో నానబెట్టి ప్రత్యేక పాత్రలో ఉంచాలి. తర్వాత వడకట్టి నీళ్లు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఈ నీటిని తీసుకుని జుట్టుకు పట్టించాలి.

అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత తేలికపాటి షాంపూతో కడిగేయండి. బియ్యాన్ని నానబెట్టడం లేదా ఉడకబెట్టడం ద్వారా మనకు లభించే పిండి నీటిని బియ్యం నీళ్లు అంటారు.

ఈ బియ్యం నీళ్లలో వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇందులో అమినో యాసిడ్స్, బి విటమిన్లు, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి.




