Ayurveda Tips: మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ వంటింటి ఆయుర్వేద చిట్కాలు ట్రై చేసి చూడండి..
బిర్యానీ వంటి మసాలా ఫుడ్ ని నూనెలో వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తినడం వలన జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. జీర్ణక్రియ సరిగా లేకుంటే వాంతుల వంటి ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. అయితే మలబద్ధకం నివారణకు మందులు ఉన్నాయి. వీటిని రొజూ తీసుకోవడం శరీరానికి మంచిది కాదు. కనుక ఆయుర్వేదం సహాయం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఆహారాలన్నీ నియమాల ప్రకారం తినడం వల్ల మలబద్ధకం రాదు. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది

మారిన జీవన విధానం.. ఆహారపు అలవాట్లతో మలబద్ధకం లేదా కడుపులో గ్యాస్ చాలా సాధారణం. అయితే ఈ రెండు సమస్యలు చాలా ఇబ్బందికరమైనవి. మలవిసర్జన సమయంలో కొంతమంది తీవ్ర ఇబ్బందులను పడతారు. అయితే మలబద్ధకం సమయం బారిన పడితే నిర్లక్ష్యం వద్దు. ఇది అనేక వ్యాధులకు, ఆరోగ్య సమస్యలకు కారణంగా మారుతుంది. మలబద్ధకం ఉంటే ఆకలి తగ్గుతుంది. కడుపు నొప్పి, వికారం, అలసట వంటి ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. చలికాలంలో తక్కువగా నీరు తాగుతారు. శీతాకాలంలో రక్షణ కోసం ధరించే బట్టలు కూడా అదిక వేడిని ఉత్పత్తి చేస్తాయి. దీని కారణంగా కూడా కడుపులో వేడి ఎక్కువ అవుతుంది. నిద్ర సరిగా లేకపోయినా మలబద్ధకం సమస్య వస్తుంది. శీతాకాలంలో తినే ఆహారం కూడా మలబద్దకనికి కారణంగా మారతాయి. వేయించిన ఆహారం, స్వీట్లు, స్ట్రీట్ ఫుడ్ వంటి ఆహారం తినడం వల్ల గ్యాస్ వస్తుంది. శీతాకాలంలో చాలామంది పార్టీలు, పిక్నిక్‌లకు వెళ్తారు. అక్కడ బిర్యానీ వంటి మసాలా ఫుడ్ ని నూనెలో వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తినడం వలన జీర్ణ సమస్యలు ఏర్పడతాయి. జీర్ణక్రియ సరిగా లేకుంటే వాంతుల వంటి ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. అయితే మలబద్ధకం నివారణకు మందులు ఉన్నాయి. వీటిని రొజూ తీసుకోవడం శరీరానికి మంచిది కాదు. కనుక ఆయుర్వేదం సహాయం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ఆహారాలన్నీ నియమాల ప్రకారం తినడం వల్ల మలబద్ధకం రాదు. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది
మలబద్దకం బారిన పడకుండా గుల్కండ్ చాలా బాగా పనిచేస్తుంది. గోరువెచ్చని పాలలో గులాబీ రేకులతో చేసిన గుల్కండ్, తేనె మంచి మెడిసిన్. అంతేకాదు పంచదార, మెంతుల పొడి, యాలకుల పొడి కలుపుకుని తిన్నా మంచి రిజల్ట్ వస్తుంది. విత్తనాలను తీసివేసి గులాబీ రేకులతో తయారు చేసిన గుల్కండ్ అందమైన రంగుతో పాటు మంచి రుచిని కలిగి ఉంటుంది. మలబద్ధకం నివారణకు ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తినే ఆహారంలో చేర్చుకోండి.
మలబద్ధకం కోసం ఉత్తమమైనవి మెంతులు. మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుండి విముక్తి పొందడం కోసం క్రమం తప్పకుండా మెంతులను తీసుకోండి. గాజు గ్లాస్ లో నీరు తీసుకుని ఒక స్పూన్ మెంతులను రాత్రంతా నానబెట్టి.. ఆ మెంతులను మర్నాడు ఉదయం తినండి. లేదా నిద్ర పోయే మందు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ మెంతిపొడి వేసుకుని తాగండి. దీంతో సుఖ విరేచనం అవుతుంది.
మలబద్ధకం ప్రధాన కారణాల్లో ఒకటి జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం. సొంటి, మిరియాలు, జీలకర్ర, నల్ల జీలకర్ర, పింక్ సాల్ట్, ఇంగువ, మిరియాల పొడి మిశ్రమాన్ని తీసుకుని ఒక స్పూన్ నీరు వేసి కలిపి ఈ మిశ్రమాన్ని ఆహారం తినడానికి ముందు తీసుకోండి.
మలబద్ధకం లక్షణాలలో ఒకటి ప్రేగు కదలికలు సరిగ్గా లేకపోవడంతో పాటు ప్రేగు కదలికల సమయంలో నొప్పి, అపానవాయువు, కడుపు నొప్పి, వికారం. కనుక మలబద్ధకం నివారణ కోసం పరిశుభ్రమైన నీరుని తాగండి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినకండి. ఫైబర్ తక్కువగా ఉండే ఫుడ్స్ ఎక్కువ తినండి.. జున్ను, డైరీ ప్రొడక్ట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, మాంసాన్ని తక్కువగా తినండి. వ్యాయామం తప్పనిసరి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








