Dried Lemon: ఎండిన నిమ్మకాయలతో ఆ సమస్యలన్నింటినీ మాయం చేసుకోవచ్చు!
నిమ్మకాయలతో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. స్కిన్ పరంగా, జుట్టుకి, ఆరోగ్య పరంగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అంతే కాకుండా పలు రకాల అనారోగ్య సమస్యల్ని కూడా తగ్గించుకోవచ్చు. నిమ్మ కాయలు అన్ని కాలాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా నిమ్మ కాయలు తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. నిమ్మ రసం తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. వేసవి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే నిమ్మ కాయలు ఇంటికి..

నిమ్మకాయలతో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. స్కిన్ పరంగా, జుట్టుకి, ఆరోగ్య పరంగా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అంతే కాకుండా పలు రకాల అనారోగ్య సమస్యల్ని కూడా తగ్గించుకోవచ్చు. నిమ్మ కాయలు అన్ని కాలాల్లో కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా నిమ్మ కాయలు తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. నిమ్మ రసం తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. వేసవి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే నిమ్మ కాయలు ఇంటికి తీసుకొచ్చాక ఎక్కువ కాలం నిల్వ ఉండవు. త్వరగా పాడైపోతాయి. ఇలా ఎండి పోయిన నిమ్మ కాయల్ని బయట పారేస్తూ ఉంటారు. కానీ వాటితో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోహకాహార నిపుణులు చెబుతున్నారు. మరి ఎండిన నిమ్మకాయలతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండిన నిమ్మ కాయల్లో పోషకాలు:
ఎండిన నిమ్మ కాయల్లో మెగ్నీషియం, విటమిన్ సి, ఐరన్, జింక్, ఐరన్, పొటాషియం, ఫైబర్, చక్కెర, కొవ్వు, ప్రోటీన్లు ఉంటాయట.
ఎండిన నిమ్మకాయలతో ఆరోగ్య ప్రయోజనాలు:
1. ఎండిన నిమ్మకాయల్లో పాలీ ఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది బరువు తగ్గించడంలో ఎంతో హెల్ప్ చేస్తాయి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు ఎండిన నిమ్మకాయల్ని ఉపయోగించుకోవచ్చు.
2. శరీరంలో కొవ్వును తగ్గించడంలో సహాయ పడుతుంది. అధిక కొవ్వు ఉన్నవారు ఎండు నిమ్మకాల్ని యూజ్ చేయవచ్చు.
3. ఎండిన నిమ్మకాయ పొడిని తీసుకోవడం వల్ల హైబీపీ సమస్య నుంచి బయట పడొచ్చు.
4. ఎండిన నిమ్మ కాయలను తీసుకోవడం వల్ల అలసట, నీరసం దరి చేరవు.
5. లో బీపీ ఉన్న వారు కూడా ఎండిన నిమ్మకాయలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయట పడొచ్చు.
6. కీళ్ల నొప్పులతో బాధ పడేవారు కూడా ఈ నిమ్మ కాయ తీసుకోవడం వల్ల ఎన్నో లాభలు ఉన్నాయి.
7. ఎండిన నిమ్మ కాయల్ని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలతోపాటు మలబద్దకం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందుతారు.
8. ఎండిన నిమ్మకాయల పొడిని చర్మానికి కూడా రాసుకోవచ్చు. దీని వల్ల చర్మం క్లియర్‌గా ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.








