అద్భుతమైన పానీయం.. ఈ టీ డైలీ తాగితే డయాబెటిస్‌తో పాటు ఆ సమస్యలకు ఛూమంత్రం వేసినట్లే..
వెల్లుల్లిలో అనేక రకాల ఔషధగుణాలు దాగున్నాయి.. అందుకే వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.. సాధారణంగా ఇప్పటి వరకు మన అల్లం లేదా ఇతర రకాల టీలను తాగి ఉంటాం.. అయితే.. కాస్త భిన్నమైన వెల్లుల్లి టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
వెల్లుల్లిలో అనేక రకాల ఔషధగుణాలు దాగున్నాయి.. అందుకే వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.. సాధారణంగా ఇప్పటి వరకు మన అల్లం లేదా ఇతర రకాల టీలను తాగి ఉంటాం.. అయితే.. కాస్త భిన్నమైన వెల్లుల్లి టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. దీనికి సంబంధించిన ప్రయోజనాల గురించి తెలుసుకుంటే.. ఆశ్చర్యపోవాల్సిందేనని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి టీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ టీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. వాస్తవానికి చాలామంది వెల్లుల్లి రెబ్బలను, పానీయాన్ని ఉదయాన్నే తీసుకుంటారు.. ప్రతిరోజూ ఉదయాన్నే వెల్లుల్లీ టీ తీసుకుంటే.. అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.. ఇంకా దీనిని ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు.. గార్లిక్ టీ.. డయాబెటిస్ కే కాకుండా శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
వెల్లుల్లి టీ తాగడం వల్ల 7 ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి..
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు ఉన్నాయి.. అందుకే ఇది పవర్‌ఫుల్ అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కావాలంటే.. మీరు వెల్లుల్లి టీలో కొద్దిగా అల్లం, దాల్చిన చెక్కను కూడా జోడించవచ్చు. తద్వారా ఆరోగ్య ప్రయోజనాలు మరింత మెరుగుపడటంతోపాటు టీ రుచి కూడా పెరుగుతుంది.
- డయాబెటిక్ పేషెంట్లకు గార్లిక్ టీ చాలా మేలు చేస్తుంది. దీంతో శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఇది జీవక్రియ స్థితిలో కూడా సహాయపడుతుంది.
- వెల్లుల్లి టీ తీసుకోవడం వల్ల శరీరంలోని మురికిని తొలగించుకోవచ్చు.
- వెల్లుల్లి టీతో బరువు తగ్గవచ్చు. ఈ టీ మీ శరీరంలోని చాలా భాగాలలో కొవ్వును కరిగించడానికి పని చేస్తుంది. మెటబాలిజం మెరుగుపరిచే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
- గార్లిక్ టీ కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. దీని వల్ల గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు.
- గార్లిక్ టీ శ్వాసకోశ వ్యాధులను నివారిస్తుంది. శీతాకాలంలో జ్వరం, దగ్గును నయం చేయడానికి కూడా దీనిని సేవించవచ్చు.
- ఈ టీ ఒక శక్తివంతమైన యాంటీబయాటిక్ పానీయం, ఇది శరీర రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
- గార్లిక్ టీ శరీరంలో మంటను తగ్గిస్తుంది.
వెల్లుల్లి టీ ఎలా తయారు చేయాలి?
వెల్లుల్లి టీ ఎలా తయారు చేయాలంటే.. దీని కోసం ముందుగా ఓ గిన్నె తీసుకోవాలి. అందులో ఒక కప్పు నీటిని మరిగించాలి. కాసేపయ్యాక వెల్లుల్లిని దంచి అందులో వేయాలి. దీనితో పాటు, ఒక చెంచా నల్ల మిరియాలు వేసి, ఆపై టీ ఐదు నిమిషాలు మరగనివ్వండి.. ఐదు నిమిషాల తర్వాత, ఆఫ్ చేసి టీని ఒక పాత్రలో ఫిల్టర్ చేయండి. ఈ విధంగా మీరు వెల్లుల్లి టీని తయారు చేసుకుని తాగొచ్చు..
గమనిక: ఈ టిప్స్ ఫాలో అయ్యేముందు వైద్యుడిని సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..