Cancer: ఈ పండ్లు గుర్తుపట్టారా? వీటిని తింటే జన్మలో క్యాన్సర్ రాదట..
పొలాల్లో.. రోడ్ల పక్కన.. ఎక్కడపడితే అక్కడ కనిపించే రేగు పళ్లు మన చిన్న తనంలో తిన్న జ్ఞాపకాలు ప్రతి ఒక్కరికీ ఉన్నాయి. అయితే వీటిని ఏవో పిచ్చిపళ్లు అనుకుని లైట్ తీసుకుంటే చాలానే నష్టపోతారు. ఎందుకంటే వీటిల్లో పోషకాలు కోట్లు ఖర్చుపెట్టినా దక్కవు మరి..

బోర్ ఫ్రూట్, బేర్ ఫ్రూట్, బుగూరి ఫ్రూట్ ఇలా రకరకాల పేర్లతో పిలిచే పండు.. అదేదో కాదు అదే.. మన పల్లెల్లో కనిపించే రేగిపండు. రేగిపళ్లు తలచుకోగానే మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. ముఖ్యంగా శీతాకాలంలో మార్కెట్‌లో ఇవి అందుబాటులోకి వస్తాయి. ఈ పండు రంగు, ఆకారం చూస్తే ఎవరికైనా నోరు ఊరాల్సిందే. రేగిపళ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో విటమిన్ ఎ, సి, మినరల్ న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కండరాలు, నాడీ వ్యవస్థ, చర్మానికి అవసరమైన అనేక పోషకాలు అందిస్తుంది. రేగిపళ్లలో పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, ఐరన్, జింక్ వంటి పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులోని ఐరన్ కంటెంట్ హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. ఇంకా వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం..
చర్మ ఆరోగ్యానికి మంచిది
రేగిపళ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి మరింత మెరుపును అందించడంలో సహాయపడుతుంది. మొటిమల నుండి కూడా రక్షిస్తుంది. ఈ పండులో ఉండే కాల్షియం, ఫాస్పరస్ కంటెంట్ ఎముకలను పటిష్టం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ పండ్లలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్ ఫైటోకెమికల్స్, పాలీశాకరైడ్స్, ఫ్లేవనాయిడ్స్, సపోనిన్‌లు కూడా ఉంటాయి. ఇవి మంచి నిద్రకు సహాయపడతాయి. అంతే కాకుండా ఇందులో బ్లడ్ షుగర్ తగ్గించే గుణాలు ఉన్నందున మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మేలు చేస్తుంది. మలబద్ధకంతో బాధపడేవారు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి.
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
రేగిపళ్లు ఆస్టియో ఆర్థరైటిస్‌ను నివారిస్తుంది. ఈ పండ్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాకుండా రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇది గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ పండును పేస్ట్‌గా చేసి చర్మానికి అప్లై చేయడం వల్ల గాయం మానడంతో పాటు చర్మం మృదువుగా మారుతుంది. అలాగే ఈ పండులో ఉండే యాంటీమైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరుకు సహాయపడుతుంది.
క్యాన్సర్‌ను నివారిస్తుంది
రేగిపళ్లు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. కాలేయ పనితీరు కూడా సాధారణమవుతుంది. అలాగే వీటిని తినడం వల్ల క్యాన్సర్ కారకాలు దూరం చేసుకోవచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. వీటిల్లోని పోషకాలు అనేక భయంకరమైన వ్యాధులను దూరం చేస్తాయి.




