Hiccups: ఎంతకూ వెక్కిళ్లు ఆగడంలేదా? ఇలా చేస్తే చిటికెలో ఆగిపోతాయ్..
ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరికీ వెక్కిళ్లు వస్తుంటాయి. అయితే కొందరికి నీళ్లు తాగితే సర్దుకుంటాయి. అయితే మరికొందరికి ఎన్ని నీళ్లు తాగినా వస్తూనే ఉంటాయి. దీంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవల్సి వస్తుంది. ఇలాంటి వారికి వెక్కిళ్లు చిటికెలో ఆపాలంటే ఇలా చేసి చూడండి..

How To Get Rid Of Hiccups
ఎక్కిళ్లు ఎప్పుడు వస్తాయో, ఎలా వస్తాయో చెప్పలేం.. కొందరికి ఎక్కిళ్లు వెంటనే ఆగిపోతాయి. మరికొందరికి ఎంతకూ ఆగవు. ఎన్ని నీళ్లు తాగినా ఎక్కిళ్లు ఆగవు. సాధారణంగా ఎవరికైన వెక్కిళ్లు వస్తే.. అదే సమయంలో ఎవరో మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారని భావిస్తారు. కానీ అది నిజం కాదు. అధిక స్పైసీ ఫుడ్, ఆల్కహాల్, సోడా వంటి కార్బోనేటేడ్ డ్రింక్స్ తీసుకోవడం, చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల వెక్కిళ్లు వస్తాయి. కాబట్టి మీకెప్పుడైనా వెక్కిళ్లు వస్తే.. ఈ హోం రెమెడీస్‌తో చిటికెలో ఉపశమనం పొందండి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
వెక్కిళ్లు ఆగడానికి ఏం చేయాలంటే..
- వెక్కిళ్లు వచ్చిన వెంటనే చల్లటి లేదా వేడినీరు తాగాలి. ఇది వెక్కిళ్లు సమస్యను తక్షణమే తొలగిస్తుంది.
- వెక్కిళ్లు వచ్చిన వెంటనే మెడ భాగాన్ని వెనుక నుంచి సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ చిట్కా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
- వెక్కిళ్లు వచ్చినప్పుడు కొన్ని క్షణాలు మీ శ్వాసను బిగపట్టుకోండి. ఈ పద్ధతి వెక్కిళ్లు ఆపడానికి బలేగా సహాయపడుతుంది.
- వ్యక్తి దృష్టిని మరల్చడం వల్ల వెక్కిళ్లను క్షణంలో ఆపవచ్చు.
- ముక్కును చేతులతో గట్టిగా పట్టుకోవాలి. ఇలా చేస్తే ఊపిరితిత్తుల్లోని కార్బన్ డై ఆక్సైడ్ బయటకు వెళ్లి వెక్కిళ్లు ఆగుతాయి.
- బొటనవేలుతో అరచేతిని మసాజ్ చేయడం వల్ల కూడా వెక్కిళ్లు ఆపవచ్చు.
- నీళ్లు తాగిన తర్వాత వెక్కిళ్లు ఆగకపోతే నాలుక బయటపెట్టి కాసేపు అలాగే ఉంచండి. ఇది గొంతు కండరాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో వెక్కిళ్లు ఆగుతాయి.
- ఒక చెంచా పంచదార తీసుకుని బాగా నమిలి అరగ్లాసు నీళ్లు తాగాలి. ఇలా చేస్తే వెక్కిళ్లు అకస్మాత్తుగా ఆగిపోతాయి.
- వెక్కిళ్లు వచ్చినప్పుడు, అకస్మాత్తుగా కూర్చుని, మీ మోకాళ్ళను మీ ఛాతీ పైకి తీసుకుని కొంతసేపు అదే భంగిమలో కూర్చోవాలి. ఇలా చేస్తే
- ఊపిరితిత్తులు కుదింపుకుగురై కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా వెక్కిళ్లు ఆగుతాయి.
- ఇంట్లో పేపర్ బ్యాగ్ ఉంటే అందులోంచి పది సార్లు ఊపిరి పీల్చుకున్నా వెక్కిళ్లు ఆగుతాయి.
Follow Us
