AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా.. ఎవరంటే?

Virat Gesture Video: బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన గొప్ప మనసును చాటుకున్నాడు. ప్రత్యర్థి జట్టు చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన తీరుకు కోహ్లీ ముగ్ధుడయ్యాడు. మైదానంలో శత్రుత్వాన్ని పక్కనపెట్టి, ఒక తోటి క్రీడాకారుడి ప్రతిభను కోహ్లీ అభినందించిన తీరు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Video: టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా.. ఎవరంటే?
Vira Kohli Sarfaraz Khan
Venkata Chari
|

Updated on: Apr 06, 2026 | 6:16 PM

Share

Virat Gesture Video: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భావోద్వేగాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. చెన్నై జట్టు వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో సర్ఫరాజ్ ఖాన్ ఒంటరి పోరాటం చేసిన సంగతి తెలిసిందే. అతను అవుట్ అయి పెవిలియన్ వైపు వెళ్తున్నప్పుడు, విరాట్ కోహ్లీ ఈల వేసి మరీ అతన్ని పిలిచి, చప్పట్లతో అభినందించడం గమనార్హం. ఒకప్పుడు బెంగళూరు జట్టులోనే కలిసి ఆడిన వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఈ సందర్భంగా స్పష్టంగా కనిపించింది. క్రీడా స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిన ఈ దృశ్యం క్రికెట్ అభిమానుల మనసు గెలుచుకుంది.

సర్ఫరాజ్ ఖాన్ వీరోచిత పోరాటం..

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టుకు ఆరంభంలోనే గట్టి షాకులు తగిలాయి. పవర్‌ప్లేలోనే రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మ్హాత్రే వంటి కీలక వికెట్లను కోల్పోయి 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సంజూ శాంసన్ కూడా త్వరగానే అవుట్ కావడంతో చెన్నై ఓటమి ఖాయమనిపించింది. అయితే, ముంబైకి చెందిన సర్ఫరాజ్ ఖాన్ మాత్రం బెదరలేదు. మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపిస్తూ కేవలం 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 8 ఫోర్లతో బెంగళూరు బౌలర్లపై ఎదురుదాడి చేసి మ్యాచ్‌ను రక్తికట్టించాడు.

ఒంటరి పోరాట యోధుడిగా సర్ఫరాజ్..

ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన ఆశాజనకంగా లేకపోయినప్పటికీ, సర్ఫరాజ్ ఖాన్ మాత్రం నిలకడగా రాణిస్తున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ అద్భుతమైన బ్యాటింగ్‌తో తన సత్తా చాటాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో అవుట్ అయ్యే వరకు అతను చెన్నై ఆశలను సజీవంగా ఉంచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, ఒత్తిడికి లోనుకాకుండా సర్ఫరాజ్ ఆడిన తీరు విమర్శకుల ప్రశంసలు కూడా పొందుతోంది. కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాడి నుంచి లభించిన ఈ గుర్తింపు సర్ఫరాజ్ భవిష్యత్తుకు మరింత ఊతాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈమెనే..
ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈమెనే..
ఆర్జీవీ లేకపోతే నేను లేను.. కిచ్చా సుదీప్..
ఆర్జీవీ లేకపోతే నేను లేను.. కిచ్చా సుదీప్..
జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు వర్షం
జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు వర్షం
రాహువుతో జాగ్రత్త.. ఆ రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు..!
రాహువుతో జాగ్రత్త.. ఆ రాశుల వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు..!
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
నా లవర్‌తో మాట్లాడిస్తారా ?? లేదా ఇక్కడ నుండి దూకేయమంటారా?
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
ఇలాంటి వ్యక్తులు మీ జీవితం లో ఉంటే.. త్వరగా ముసలివారు అవుతారు !
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
పెళ్లికి ముందు సూది మందు.. ఒక్కటి పడితే చాలు బరువు తగ్గాల్సిందే
ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
ప్రాణం పోసిన స్నేక్‌ క్యాచర్‌కు నాగుపాము కృతజ్ఞత..
టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా
టీమిండియా ఛీ కొట్టినా.. బ్యాడ్ లక్కోడి ఆటతీరుకు కోహ్లీ ఫిదా
మళ్లీ కట్టెల పొయ్యిలపై వంటలు.. బయో గ్యాస్‌కూ పెరిగిన డిమాండ్‌ !!
మళ్లీ కట్టెల పొయ్యిలపై వంటలు.. బయో గ్యాస్‌కూ పెరిగిన డిమాండ్‌ !!