Health Tips: పల్లీలు వర్సెస్ బాదం.. బరువు తగ్గాలనుకునే వారు ఏది తినడం మంచిది?
peanuts vs almonds weight loss: బరువు తగ్గాలనుకునే వారికి,ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వారికి వేరుశనగలు, బాదం రెండూ అద్భుతమైన ఎంపికలు. అయితే చాలా మందిలో ఉండే డౌట్ ఏమిటంటే.. ఈ రెండింటిలో ఏది మెరుగైన ఫలితాలను అందిస్తాయని. మీకు ఇదే డౌట్ ఉందా.. అయితే బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని తెలుసుకుందాం పదండి

జర్నల్ ఆఫ్ న్యూట్రిషియంట్స్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, రోజూ 10–100 గ్రాముల బాదం పప్పులను క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.అంతే కాదు ఇది చెడు LDL కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించి, అదే సమయంలో మంచి HDL కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని తేలింది. దీనికి తోడు, బాదం పప్పులలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది మీకు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగించి, బరువు నిర్వహణకు సహాయపడుతుంది.
పల్లీలు వర్సెస్ బాదం
వేరుశనగ: 100 గ్రాముల పచ్చి వేరుశెనగలో సుమారుగా 23 గ్రాముల ప్రోటీన్, ప్రతి ఔన్సుకు 2 గ్రాముల ఫైబర్, దాదాపు 166 కేలరీలు ఉంటాయి. వేరుశెనగలో ఫోలేట్, నియాసిన్‌తో సహా బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఆహారాన్ని శక్తిగా మార్చడానికి, జీవక్రియ ప్రక్రియలకు మద్దతు ఇవ్వడానికి సహాయపడతాయి, అందువల్ల బరువును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్న చురుకైన వ్యక్తులకు ఇవి చాలా బాగా ఉపయోగపడుతాయి.
బాదం పప్పులు: బాదం పప్పులు 100 గ్రాములకు 21 గ్రాముల ప్రోటీన్‌తో కొద్దిగా తక్కువ ప్రోటీన్‌ను అందిస్తాయి, కానీ ఫైబర్ విషయంలో చాలా ఉన్నతమైనవి, ప్రతి 100 గ్రాములకు 10.8 గ్రాముల ఫైబర్‌ను కలిగి ఉంటాయి. ఇవి ప్రతి ఔన్సుకు దాదాపు 170 కేలరీలను కలిగి ఉంటాయి. అలాగే వీటిలో విటమిన్ ఇ, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకల ఆరోగ్యానికి, యాంటీఆక్సిడెంట్ రక్షణకు, మొత్తం శ్రేయస్సుకు తోడ్పడతాయి, ఇవి పరోక్షంగా బరువు తగ్గించే ప్రయత్నాలను మెరుగుపరుస్తాయి.
వేరుశనగ వల్ల కలిగే ప్రయోజనాలు
వేరుశనగలు తక్కువ ధరలో దొరికే గొప్ప ప్రోటీన్. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల కండరాలు బలోపేతం అవ్వడానికి, వ్యాయామం తర్వాత కోలుకోవడానికి సహాయపడుతుంది. ఇందులోని విటమిన్ B ఆహారాన్ని శక్తిగా మార్చడంలో, జీవక్రియను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. తక్కువ ధరలో ఎక్కువ ప్రోటీన్ పొందాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక.
బాదం వల్ల కలిగే ప్రయోజనాలు
బాదం పప్పులు పోషకాల గని, ఇవి బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బాదంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఇది కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగించి, అనవసరమైన ఆహారం తీసుకోకుండా చేస్తుంది. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి, ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే విటమిన్ E, కాల్షియం చర్మ సౌందర్యానికి, ఎముకల పుష్టికి మేలు చేస్తాయి.
బరువు తగ్గడానికి ఏది మంచిది?
రెండూ బరువు తగ్గడానికి సహాయపడతాయి, కానీ మీ అవసరాన్ని బట్టి మీ ఏది అవసరమో దాన్ని ఎంచుకోవాలి. మీరు ప్రోటీన్ కోసం చూస్తుంటే వేరుశనగలు మంచి ఆప్షన్ అవుతాయి. ఒక వేళ మీరు ఆకలిని నియంత్రించుకోవాలి అనుకుంటే, ఫైబర్ ఎక్కువగా ఉన్న బాదం మీకు మంచి ఆప్షన్ అవుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
