AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Veg Momo’s: అందర్నీ టెంప్ట్ చేసే వెజ్ మోమోస్.. ఇలా చేస్తే అదుర్స్!

ప్రస్తుత కాలంలో మోమోస్ ఎంతగా ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్ట్రీట్ ఫుడ్‌లో ఇప్పుడు ఇవి కూడా చేరిపోయాయి. అందరూ వీటిని లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు. వెజ్ మోమోస్‌ చాలా రుచిగా ఉంటాయి..

Veg Momo's: అందర్నీ టెంప్ట్ చేసే వెజ్ మోమోస్.. ఇలా చేస్తే అదుర్స్!
Veg Momos
Chinni Enni
| Edited By: |

Updated on: Dec 05, 2024 | 10:45 PM

Share

ప్రస్తుత కాలంలో మోమోస్ ఎంతగా ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్ట్రీట్ ఫుడ్‌లో ఇప్పుడు ఇవి కూడా చేరిపోయాయి. అందరూ వీటిని లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు. వెజ్ మోమోస్‌ని అమ్మి చాలా మంది ఎంతో డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే ఈ వెజ్ మోమోస్ తిని ఫుడ్ పాయిజన్ అయ్యి.. పలువురు మరణించిన వార్తలు కూడా వినే ఉంటారు. బయట ఫుడ్ ఎప్పుడైనా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇంట్లో తయారు చేసినంత శుభ్రంగా బయట తయారు చేయరు. వాళ్లు ఉపయోగించే పదార్థాలు కూడా నాశిరకమైనవి ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి ఎంతో మందికి ఫేవరేట్ ఫుడ్ అయినా వెజ్ మోమోస్‌ని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ వెజ్ మోమోస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం.

వెజ్ మోమోస్‌‌కి కావాల్సిన పదార్థాలు:

మైదా పిండి, క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, పన్నీర్ తురుము, మిరియాల పొడి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, తెల్ల మిరియాల పొడి, సోయాసస్, ఉప్పు, ఆయిల్.

వెజ్ మోమోస్‌ తయారీ విధానం:

ఈ వెజ్ మోమోస్‌ని ఎంతో ఈజీగా తయారు చేయవచ్చు. ఒక గిన్నెలోకి కొద్దిగా మైదా పిండి తీసుకోండి. ఇందులో నీళ్లు పోసి మెత్తగా అయ్యేలా కలిపి.. ఓ పావు గంట సేపు పక్కన పెట్టండి. ఇప్పుడు కూరగాయల్ని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో కొద్దిగా బటర్, ఆయిల్ వేయాలి. ఇందులో కూరగాయల ముక్కలు వేసి.. ఓ పదినిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత ఉప్పు, తెల్ల మిరియాల పొడి, మిరియాల పొడి, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు, సోయా సాస్ వేసి అన్నీ కలపాలి. ఇప్పుడు మైదా పిండి తీసుకుని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. వీటిని ఇప్పుడు చిన్న ఉండలుగా చేసి.. చిన్న పూరీలా చేసుకుని అందులో వెజిటేబుల్ స్టవ్ ఉంచి.. మోమోస్ షేపులో చుట్టుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఈ మోమోస్‌ని చాలా రకాల షేపుల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ గిన్నె తీసుకుని.. అందులో గ్లాసు నీళ్లు వేసి మరిగించాలి. ఆ తర్వాత ఒక ఇడ్లీ రేకు తీసుకుని దానికి ఆయిల్ రాసుకోవాలి. ఇప్పుడు మోమోస్‌ని అన్నీ ఉంచి.. మీడియం మంట మీద ఓ పావు గంట సేపు ఉడికించాలి. అంతే ఎంతో రుచిగా ఉండే వెజ్ మోమోస్ సిద్ధం. వీటిని టమాటా సాస్ లేదా మోమోస్ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్