AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు కురిపిస్తున్న కొత్తిమీర పంట..

Coriander Farming: కొత్తిమీరే కదా అని తీసిపారేయకండి. ఎందుకంటే ఈ చిన్నరకం పంట ఆ ప్రాంత రైతులకు బోలెడు ఆదాయాన్ని తెచ్చి పెడుతుంది. కార్పొరేట్ జాబులు చేసే వాళ్లకంటే అక్కడి రైతులే ఎక్కువ సంపాధిస్తున్నారు. జస్ట్ 30 రోజుల్లోనే అక్షరాల లక్షరూపాయలు ఇంటికి తీసుకెళ్తున్నారు. పసుపు సాగు చేసిన నేలలు కావటంతో అధిక దిగుబడితో పాటు ఇక్కడ పండించిన కొత్తిమీరకు రాష్ట్రవ్యాప్తంగా అధిక డిమాండ్ ఏర్పడుతుంది. ఇంతకు కొత్తమీరతో లక్షలు సంపాధిస్తున్న ఆ గ్రామం ఏదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే

Telangana: జస్ట్ 30 రోజుల్లోనే లక్ష సంపాదన.. ఆ జిల్లా రైతులపై కాసులు కురిపిస్తున్న కొత్తిమీర పంట..
Coriander Farming
Diwakar P
| Edited By: |

Updated on: Apr 06, 2026 | 6:28 PM

Share

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్ పల్లెలు కొత్తిమీర సాగుకు కేరాఫ్ గా నిలుస్తున్నాయి. ముఖ్యంగా వాణిజ్య పంటలైన పసుపు, మొక్కజొన్న జొన్న పంటలను ఇక్కడి రైతులు సాగు చేస్తారు. అయితే ఆరుతడి పంటగా గత కొన్నేళ్ల నుండి కొత్తిమీరను కూడా సాగుచేస్తున్నారు రైతులు. ఈ పంటతో వేసవికాలంలో సైతం అధిక దిగుబడి సాధిస్తున్నారు. ఇక్కడ పండించిన కొత్తిమీరకు రాష్ట్ర మార్కెట్ లోనే కాదు పక్క రాష్ట్రాల్లోనూ భారీ గా డిమాండ్ ఉంది. దీంతో ఈ పంట రైతులకు సిరులు కురిపిస్తుంది. ఈ చిన్నరకం పంట అంకాపూర్ కేంద్రంగా జరిగే కొత్తిమీర మార్కెట్ నుండి ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. జస్ట్ 30 రోజుల్లోనే లక్షల సంపాదనతో సంప్రదాయం పసుపు పంటలో ఏర్పడే నష్టాన్ని కొత్తిమీర ద్వారా వచ్చిన లాభాలతో పూరించుకుంటారు ఇక్కడి రైతులు

కొత్తిమీర సాగు విధానం

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో రైతులు కొత్తిమీర పంటను అధికంగా పండిస్తున్నారు. జూన్ మాసంలో పసుపు పంటను విత్తుకుంటారు. తొమ్మిది నెలలు పంటను పండిస్తారు అనంతరం పసుపు తవ్వకాలు చేసి దుక్కి దున్ని నేలను చదును చేసుకుంటారు. కొత్తిమీర పంటను వేయడానికి ట్రాక్టర్ సహాయంతో గెరలు వేసి ధనియాలను విత్తుకుంటారు. విత్తిన నాటిన ముప్పై నుండి నలభై రోజుల్లోనే పంట చేతుకొస్తుంది. అయితే పంటలకు తెగుళ్లు రాకుండా విత్తుకున్న ఇరవై రోజులకు మందులను పిచికారి చేస్తారు. దీంతో ఇది అధిక దిగుబడిని ఇస్తుంది.

తక్కువ సమయం.. ఎక్కవ ఆదాయం

అయితే పసుపు పంట తీసిన రైతులు గతంలో నువ్వులు సాగు చేసే వారు. దాని టైంతో పాటు కష్టం కూడా ఎక్కుగా ఉండడంతో ప్రస్తుతం అందరూ తక్కువ సమయంలో ఎక్కవ ఆదాయం ఇచ్చు కొత్తిమీరకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్తమీర పంటలో ఉన్న మరో అడ్వాంటేజ్ ఏమిటంటే.. తమ పంటను అమ్మేందుకు రైతులు మార్కెట్‌లకు వెళ్లాల్సిన అవసరం లేదు.. వ్యాపారులే రైతుల వద్దకు వచ్చిన పంటను కొనుగోలు చేస్తారు. ఇలా ఈ పంటపై రైతు రూ.15-20 వేల పెట్టుబడి పెడితే.. రూ.లక్షల వరకు ఆధాయం వస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కేవలం 2-3 గంటల్లోనే పాలు తోడుకోవాలంటే ఇలా చేయండి..
కేవలం 2-3 గంటల్లోనే పాలు తోడుకోవాలంటే ఇలా చేయండి..
మాట్లాడటంలో ఇబ్బంది, చేతులు బలహీనంగా మారుతున్నాయా? అలసత్వం వద్దు
మాట్లాడటంలో ఇబ్బంది, చేతులు బలహీనంగా మారుతున్నాయా? అలసత్వం వద్దు
ఒక్కడే కూర్చుని కన్నీళ్లు పెట్టిన వైభవ్.. బుడ్డోడిని ఇలా చూస్తే..
ఒక్కడే కూర్చుని కన్నీళ్లు పెట్టిన వైభవ్.. బుడ్డోడిని ఇలా చూస్తే..
20ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన కుర్ర హీరోయిన్
20ఏళ్ల పెద్ద హీరోని పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చిన కుర్ర హీరోయిన్
చికెన్ vs చేపలు.. వర్షాకాలంలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
చికెన్ vs చేపలు.. వర్షాకాలంలో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
దిగ్గజ గాయని జానకమ్మ జీవితంలో ఇంత అందమైన ప్రేమకథ ఉందా?
దిగ్గజ గాయని జానకమ్మ జీవితంలో ఇంత అందమైన ప్రేమకథ ఉందా?
కరివేపాకు గుబురుగా పెరగడం లేదా? తోటమాలి చెప్పే 2 సూపర్‌ ట్రిక్స్‌
కరివేపాకు గుబురుగా పెరగడం లేదా? తోటమాలి చెప్పే 2 సూపర్‌ ట్రిక్స్‌
చిరాకు, నీరసం తగ్గి.. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే..
చిరాకు, నీరసం తగ్గి.. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే..
ఈ అట్టర్ ఫ్లాప్ టీంతో టీ20 ప్రపంచకప్ 2028కు వెళ్తారా..?
ఈ అట్టర్ ఫ్లాప్ టీంతో టీ20 ప్రపంచకప్ 2028కు వెళ్తారా..?
చిన్నప్పుడు అతన్ని ఎత్తుకొని అన్నం తినిపించా..
చిన్నప్పుడు అతన్ని ఎత్తుకొని అన్నం తినిపించా..