Hyderabad: హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట.. మహిళ మృతి

సంధ్య థియేటర్‌ దగ్గర విషాదం చోటు చేసుకుంది. పరిమితికి మించి ప్రేక్షకులు రావడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తేజ పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం బాలుడిని అధికారులు ఆస్పత్రికి తరలించారు..

Hyderabad: హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట.. మహిళ మృతి
Stampede at sandhya theatre
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 05, 2024 | 7:19 AM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 5: హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రీమియర్‌ షో సందర్భంగా బుధవారం అర్ధరాత్రి తొక్కిసలాట చోటు చేసుకుంది. ప్రీమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ (9) తీవ్రంగా గాయపడ్డాడు. పరిమితికి మించి ప్రేక్షకులు థియేటర్‌కు రావడంతో పోలీసులు లాఠీ చార్జ్‌ చేయవల్సి వచ్చింది. తొక్కిసలాటలో తల్లీకొడుకు స్పృహ కోల్పోయారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌ వద్ద అర్ధరాత్రి పరిస్థితి అదుపు తప్పింది. చికిత్స పొందుతూ తల్లి మృతి చెందగా.. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది.

దీనికి సంబంధించి అనేక వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వీడియోలో ప్రేక్షకులు థియేటర్ ప్రాంగణాన్ని ముంచెత్తడం కనిపిస్తుంది. ఈ ఘటనలో బాలుడు శ్రీతేజ్‌ స్పృహ తప్పిపడిపోవడం కనిపిస్తుంది. పోలీసు అధికారులు బాలుడిని తీసుకొచ్చి, CPR చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బాలుడి ఛాతిపై చేతులతో సీపీఆర్‌ చేసి, బాలుడి చేతులు, కాళ్ళను రుద్దడం వంటివి చేశారు. అనంతరం బాలుడిని బేగంపేట్‌ కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

కుటుంబంతో కలిసి రేవతి దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్‌కు వచ్చిన కాసేపటికే జరిగిన తొక్కిసలాటలో అనుకోని రీతిలో ఆమె మృతిచెందడం తీవ్ర విషాదకరంగా మారింది. థియేటర్‌ వద్ద దాదాపు 200 మంది పోలీసులు మోహరించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.