AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2 The Rule Live Updates: దుమ్మురేపుతోన్న పుష్ప రాజ్.. పూనకాలతో ఊగిపోతున్న ఫ్యాన్స్

Pushpa 2 Release Live in Telugu: 2024లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో 'కేజీఎఫ్: చాప్టర్ 2', 'ఆర్‌ఆర్‌ఆర్' వంటి చిత్రాలను అధిగమించి రికార్డులు సృష్టిస్తోంది.

Pushpa 2 The Rule Live Updates: దుమ్మురేపుతోన్న పుష్ప రాజ్.. పూనకాలతో ఊగిపోతున్న ఫ్యాన్స్
Pushpa 2
Rajeev Rayala
| Edited By: Rajitha Chanti|

Updated on: Dec 05, 2024 | 4:03 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. ప్రేక్షకులు ఎప్పటినుంచో ఈగర్ గా ఎదురుచూస్తున్న ఈ మూవీ నిన్న ( గురువారం) రాత్రి నుంచి థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఇప్పటికే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. పుష్ప 1 కు మించి సినిమా ఉందంటూ.. అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్స్ దగ్గర పండగ వాతావరణం నెలకొంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. పుష్ప 2 గురించి దేశమంతా మాట్లాడుకుంటుంది. ఇప్పటికే సినిమా పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Dec 2024 03:10 PM (IST)

    సుక్కు లెక్క అదిరింది..

    డైరెక్టర్ సుకుమారు యాక్షన్ సీక్వెన్స్ తర్వాత ఎమోషనల్ సీన్ పెట్టాడని.. అలాగే ఫహద్ ఫాజిల్ ఎంట్రీని అదిరిపోయేలా ప్లాన్ చేశారని సుకుమార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.

  • 05 Dec 2024 12:21 PM (IST)

    నా కొడుకు అల్లుఅర్జున్ అభిమాని.. వాడి పరిస్థితి విషమంగా ఉంది : తొక్కిసలాటలో చనిపోయిన రేవతి భర్త

    తొక్కిసలాటలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్.. మాట్లాడుతూ.. మా బాబు శ్రీ తేజ అల్లు అర్జున్ ఫ్యాన్.. వాడి కోసమే మేము సినిమాకి వచ్చాము. అందరూ మా బాబుని పుష్పా అని పిలుస్తారు. కానీ నా భార్య ను కోల్పోవడం తట్టుకోలేక పోతున్న.. పోలీసులు CPR చేసినపుడు మా బాబు స్పృహ లోకి వచ్చాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. మొదట నా భార్య పిల్లలు లోపలికి వెళ్లారు.. అప్పటికి అభిమానులు మాములుగా ఉన్నారు. ఒక్కసారి అల్లు అర్జున్ రావడంతో క్రౌడ్ పెరిగింది. తొక్కిసలాట జరిగింది. మా బాబు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు.

  • 05 Dec 2024 11:46 AM (IST)

    పుష్ప 2.. రెచ్చిపోయిన ఫ్యాన్స్

    మంచిర్యాల జిల్లా  చెన్నూర్ పట్టణంలోని శ్రీనివాస టాకీస్ లో పుష్ప 2 చిత్రం ప్రదర్శన చేయలేదని ఆగ్రహించిన అభిమానులు.. టాకిస్ పై రాళ్లతో దాడికి దిగారు. థియేటర్ అద్దాలు ధ్వంసం చేశారు.

    పూర్తి వార్త ఇక్కడ చదవండి 

  • 05 Dec 2024 11:04 AM (IST)

    తొక్కిసలాటలో గాయపడిన చిన్నారి పరిస్థితి విషమం

    సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి భర్త భాస్కర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడు తేజ వెంటిలేటర్‌పై ఉన్నాడని.. 48 గంటల దాటితే గానీ ఏం చెప్పలేమని డాక్టర్లు చెప్తున్నారన్నారు.

  • 05 Dec 2024 11:03 AM (IST)

    సంధ్య థియేటర్‌కు పరిమితికి మించి ప్రేక్షకులు రావడంతో తొక్కిసలాట

    హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌కు పరిమితికి మించి ప్రేక్షకులు రావడంతో తొక్కిసలాట జరిగింది. గేట్ దగ్గరకు జనాలు చొచ్చుకురావడంతో అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి రేవతి అనే మహిళ మృతి చెందింది. కుమారుడు తేజ పరిస్థితి విషమంగా ఉండడంతో బేగంపేట్ కిమ్స్‌కు తరలించారు.

  • 05 Dec 2024 11:00 AM (IST)

    ఫహద్ ఫాజిల్ అద్భుతమైన నటన

    పుష్ప వన్ లో ఫహద్ ఫాజిల్  పాత్ర అంతగా ఉండదు. కానీ ఆయన కనిపించినంత సేపు తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు పుష్ప 2లో పూర్తి స్థాయిలో విలనిజం చూపించారని, అలాగే అద్భుతంగా నటించారని అంటున్నారు ప్రేక్షకులు

  • 05 Dec 2024 06:56 AM (IST)

    డీఎస్పీ మ్యూజిక్ కు డాన్స్‌లతో అదరగొడుతున్న ఫ్యాన్స్..

    పుష్ప 2 సినిమాకు దేవీ శ్రీ అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అని అంటున్నారు. సినిమాలోని సాంగ్స్ కు థియేటర్స్ లో ఫ్యాన్స్ డాన్స్‌లతో అదరగొడుతున్నారు.

  • 05 Dec 2024 06:35 AM (IST)

    దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్స్ అభిమానులతో నిండిపోయాయి

    పుష్ప 2 రిలీజ్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఉన్న థియేటర్స్ అభిమానులతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. పుష్ప రాజ్ క్రేజ్ పీక్స్ కు చేసుకుంది.

  • 05 Dec 2024 06:24 AM (IST)

    జాతరే జాతర.. పుష్ప రాజ్ దెబ్బకు బాక్సాఫీస్ బద్దలు

    పుష్ప రాజ్ దెబ్బకు బాక్సాఫీస్ బద్దలు అంటున్నారు ఫ్యాన్స్. ఎవరి నోట విన్నా.. పుష్ప2 బ్లాక్ బస్టర్ అంటున్నారు. ముఖ్యంగా జాతర సీన్ సినిమాకే హైలైట్ అని అంటున్నారు ఫ్యాన్స్

  • 05 Dec 2024 06:18 AM (IST)

    థియేటర్స్ దగ్గర అభిమానుల సందడి

    దేశవ్యాప్తంగా పుష్ప 2 సినిమా సందడి చేస్తుంది. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో  అభిమానుల ఆనందం రెట్టింపు అయ్యింది.

Published On - Dec 05,2024 6:14 AM