Pushpa 2: రెచ్చిపోయిన అభిమానులు.. కోపంతో థియేటర్ అద్దాలు ధ్వంసం.. ఎక్కడంటే
ఎక్కడ చూసిన ఇప్పుడు పుష్ప తప్ప మరొకటి వినిపించడం లేదు.. కనిపించడం లేదు. వరల్డ్ వైడ్ గా పుష్ప 2 సినిమా నేడు థియేటర్స్ లోకి వచ్చేసింది. ముందు నుంచి ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
పుష్ప ఫైర్ అనుకుంటివా.. కాదు వరల్డ్ ఫైరూ.. అట్టాగే ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ హంగామా. ఏ థియేటర్ చూసినా అభిమానుల పూనకాలతో థియేటర్ల వద్ద సందడి కనిపిస్తోంది. ఆదిలాబాద్ లోని ఓ థియేటర్ వద్ద అయితే అచ్చం అల్లు అర్జున్ లా పుష్ప 2 గెటప్ లో అభిమానులు సందడి చేశారు. సినిమాలోని పాత్రలో ఇమిడిపోయిన అభిమానులు.. చీరకట్టుతో నిమ్మ కాయల దండ మెడలో వేసుకుని పసుపు కుంకుమ నిండా పూసుకొని వరల్డ్ ఫైర్ మాస్ లుక్కంటూ హంగామా చేశారు. ఆదిలాబాద్ లో అలా ఉంటే మంచిర్యాల జిల్లాలో మాత్రం అభిమానులు మరింత రెచ్చిపోయారు. ఏకంగా థియేటర్ పైనే దాడి చేసి తమ ఆగ్రహాన్ని చూపించారు. మా హీరో సినిమానే ప్రదర్శించారా అంటూ సినిమా థియేటర్ అద్దాలు ధ్వంసం చేశారు. యజమాని కారుపై సైతం దాడికి తెగబడ్డారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో చోటుచేసుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన పుష్ప 2 ఫీవర్ అదే రేంజ్ లో సాగుతోంది. మంచిర్యాల జిల్లాలో అయితే పుష్ప అభిమానుల రచ్చ అంతా ఇంతా కాదు అన్నట్టుగా మారింది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని శ్రీనివాస టాకీస్ లో పుష్ప 2 చిత్రం ప్రదర్శన చేయలేదని ఆగ్రహించిన అభిమానులు.. టాకిస్ పై రాళ్లతో దాడికి దిగారు. థియేటర్ అద్దాలు ధ్వంసం చేశారు. అదే ఆగ్రహంలో ఊగిపోయిన అల్లు అర్జున్ అభిమానులు సినిమా టాకీస్ యాజమాని కారుపై సైతం దాడికిదిగారు. థియేటర్ యాజమాన్యం అక్కడికి చేరుకోవడంతో దాడికి దిగిన వ్యక్తులు పరారయ్యారు. ఘటన పై యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆదారంగా విచారణ చేపట్టారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.