25 ఏళ్ల టీచరమ్మ ప్రేమ పాఠాలు.. బాలుడిని పీకల్లోతు ప్రేమలోకి దింపి కారులో పరార్! తర్వాత ఏమైందంటే..
పాతికేళ్ల టీచర్మ ఓ మైనర్ బాలుడిని పీకల్లోతు ప్రేమలో పడేసింది. అనంతరం ఇద్దరూ ఊరి నుంచి పరారై గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు కొత్త కోడలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడికి మాయమాటలు చెప్పి వల్లో వేసుకుందని, వీరి పెళ్లి చెల్లదంటూ..
మీరట్, డిసెంబర్ 4: ఓ మహిళ టీచర్ సభ్యసమాజం తలదించుకునే పని చేసింది. పాతికేళ్ల ఆ టీచరమ్మ ఓ మైనర్ బాలుడిని ప్రేమలోకి దింపింది. ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరికొకరు పరిచయంకాగా.. అనతి కాలంలోనే వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో బాలుడి తల్లిదండ్రులకు తెలియకుండా ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌కు చెందిన 25 ఏళ్ల యువతి స్థానికంగా ఓ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ఆమెకు కొంత కాలం క్రితం మీరట్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడు సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఇద్దరూ మొబైల్ ఫోన్ల ద్వారా తరచూ మాట్లాడుకునే వారు. దాంతో ఇరువురూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఇటీవల టీచరమ్మ మీరట్‌కు కారులో వెళ్లి, సదరు బాలుడిని కారులో ఎక్కించుకుని తనతో పాటు ఘజియాబాద్‌కు తీసుకెళ్లింది. ఘజియాబాద్‌లోనే బాలుడు మేజర్ అన్నట్లుగా ఫేక్ డాక్యుమెంట్‌లు సృష్టించి, అతడిని రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకుంది. కొడుకు, కొత్త కోడలు విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ మైనర్ బాలుడికి మాయ మాటలు చెప్పి టీచర్ పెళ్లి చేసుకుందని, తమ కుమారుడి మైనర్ అయినప్పటికీ మేజర్‌గా తప్పుడు డాక్యుమెంట్‌లు సృష్టించిందని ఆరోపించారు.
తొలుత వారు మీరట్‌లోని లిసాడా గేట్ ఏరియా పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు. దాంతో వారు మీరట్ అడిషనల్ డీజీ ధ్రువ్‌కాంత్‌ను కలిసి తమ గోడు వెల్లడించారు. ఆయన చొరవతో లిసాడా గేట్ ఏరియాలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో బాలుడు మైనర్‌గా తేలితే వారి పెళ్లి రద్దవుతుంది. ఇక ఈ సంఘటన స్థానికంగా చర్చణీయాంశంగా మారింది. కౌమారదశలో ఉన్న మైనర్ బాలుడి సమ్మతితో వివాహం జరిగినప్పటికీ దానికి చట్టబద్ధంగా గుర్తింపు ఉండదు. భారతీయ చట్టం ప్రకారం 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి వివాహాన్ని చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు.