Viral Video: ఏం గుండెరా వాడిది..! వైఫ్ పక్కన ఉంటే.. సింహం కూడా జుజుబీనే..!

సోషల్ మీడియాలో రకరకాల వీడియో వైరల్ అవుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని షాకింగ్‌కు గురి చేస్తుంటాయి. తాజాగా ఓ సింహం వీడియో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: ఏం గుండెరా వాడిది..! వైఫ్ పక్కన ఉంటే.. సింహం కూడా జుజుబీనే..!
Couple On Bike Ignores Lion
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 04, 2024 | 1:05 PM

జంగిల్ సఫారీకి సంబంధించిన ఎన్నో వీడియోలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కొన్ని దృశ్యాలు సంతోషాన్ని ఇస్తుంటే, మరికొన్ని షాక్‌కు గురిచేస్తుంటాయి. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో క్లిప్ కేవలం కొన్ని సెకన్లు మాత్రమే, కానీ అది చూసిన తర్వాత ఊపిరి ఆగిపోయినంత పనైంది. ఒళ్లు గగుర్పాటు గురి చేస్తున్న ఈ వీడియోలో, ఒక బైకర్ రోడ్డు పక్కన వీధి కుక్కలాగా కూర్చున్న మృగరాజును దాటుకుంటూ దూసుకువచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో, దట్టమైన అడవి మధ్యలో రోడ్డు మార్గం కూడా సరిగా లేదు. దాని గుండా బైక్ రైడర్ వెళుతున్నారు. బైక్ వెనుక ఒక మహిళ కూడా కూర్చొని ఉంది. బహుశా అతని భార్య అయ్యి ఉంటుంది. అయితే ఆ వీడియోలో మరుసటి క్షణంలో కనిపించే దృశ్యం చాలా షాకింగ్‌కు గురి చేసింది. ముందు రోడ్డు పక్కన సింహం కూర్చున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిస్తుంది. కానీ బైకర్ దానిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు వచ్చేశాడు. అది అచ్చం ఓ పెంపుడు కుక్కలాగా కూర్చొని ఉండిపోయింది. ఆ సమయంలో సింహం స్పందన చూడాల్సిందే..! ఆ పేదవాడు మనసులో మాట చెప్పుకుంటున్నట్టుంది – బ్రదర్, నేను సింహాన్ని, కాస్త గౌరవం చూపించు. అని అనుకుని ఉండి ఉండవచ్చు. అంటూ ఈ వీడియోను చూసిన నెటిజన్లు రాసుకొచ్చారు.

ఈ వీడియోను చూడండి..

@kashyap_memer అనే ఖాతాతో Instagramలో ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ‘సింహాం అంటే గౌరవం లేదు’ అని రాశారు. కేవలం కొన్ని సెకన్ల ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ వెల్లువెత్తాయి.