Video: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. బీచ్‌ ఒడ్డున హీరోయిన్‌ యోగా.. భారీ అలకు కొట్టుకుపోయి మృతి! వీడియో

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సముద్రం ఒడ్డున యోగా చేసేందుకు వెళ్లిన హీరోయిన్.. కళ్లు మూసుకుని యోగా చేస్తుండగా భారీ అల సముద్రంలోకి లాక్కుపోయింది. ఈ దుర్ఘటనలో హీరోయిన్ మృతి చెందగా.. 15 నిమిషాల తర్వాత ఒడ్డుకు మృతదేహం కొట్టుకువచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది..

Video: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. బీచ్‌ ఒడ్డున హీరోయిన్‌ యోగా.. భారీ అలకు కొట్టుకుపోయి మృతి! వీడియో
Actress Kamilla Belyatskaya Death
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 03, 2024 | 10:37 AM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. 24 యేళ్ల యువ నటి దుర్మరణం చెందారు. యోగా చేసేందుకు సముద్రం ఒడ్డుకు వెళ్లిన ఆమె.. ఓ పెద్ద బండరాయిపై కూర్చుని యోగా చేసుకుంటూ ఉంది. ఇంతలో ఓ రాకాసి అల బలంగా ఆమెపైకి వచ్చి.. ఆమాంతం సముద్రంలోకి లాక్కుపోయింది. దీంతో నటి సముద్రంలో గల్లంతైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైలర్‌గా మారింది.

రష్యాన్‌ నటి కెమిల్లా బెల్యాట్స్కాయ (24) థాయ్‌లాండ్‌లోని ప్రముఖ విహార ప్రదేశం కో స్యామ్యూయ్ ద్వీపంకి తన ప్రియుడితో కలిసి ఇటీవల వెళ్లింది. బీచ్‌ ఒడ్డున తనకు ఇష్టమైన స్థలంలో యోగా చేసేందుకు ఒంటరిగా కారులో అక్కడి వెళ్లింది. కెమిల్లా గతంలోనూ పలు మార్లు అక్కడికి వచ్చింది. అయితే సంఘటన జరిగిన రోజు యోగా మ్యాట్‌ తీసుకుని సముద్రం ఒడ్డున చదునుగా ఉన్న ఓ పెద్ద బండరాయిపై కూర్చుని యోగా చేస్తున్న సమయంలో ఒక్కసారిగా సముద్రంలోని అలలు విజృంభించాయి. ఈ క్రమంలో ఓ పెద్ద అల కెమిల్లాను సముద్రంలోకి లాక్కుపోయింది. చాలా సేపటి వరకు ఆమె సముద్రంలో అలల మధ్య చిక్కుకుని ఉన్న దృశ్యాలు అక్కడి సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఆమె కొట్టుకుపోయిన దాదాపు 15 నిమిషాల తర్వాత రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది. సముద్రంలో ప్రమాదకరమైన అలల కారణంగా రెస్క్యూ నిలిపివేశారు. దీంతో వారు ఆమెను కాపాడలేకపోయారు. కాసేపటికే కొన్ని కిలోమీటర్ల దూరంలో నటి మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కెమిల్లా సముద్రంలోకి కొట్టుకుపోతున్న సీసీటీవీ ఫుటీజే దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

అధికారులు ఏం చెబుతున్నారంటే..

వర్షాకాలంలో మేము పర్యాటకులను నిరంతరం హెచ్చరిస్తుంటాం. ముఖ్యంగా చావెంగ్, లమై బీచ్‌ల వంటి అధిక-ప్రమాదకర ప్రాంతాలలో, ఎరుపు జెండాలు ఉన్న చోట స్విమ్మింగ్‌ చేయరాదని సూచిస్తుంటాం. నటి మృతి చెందిన సంఘటన ప్రదేశం స్విమ్మింగ్ ప్రాంతం కానప్పటికీ ఊహించని అలల ఉప్పెన కారణంగా ఆమె సముద్రంలో పడిపోయి ఉండవచ్చని సముయ్ రెస్క్యూ సెంటర్ అధికారి చైయాపోర్న్ సబ్‌ప్రసెర్ట్ ఖోసాద్ మీడియాకు తెలిపారు. ఆ విషాద సంఘటన అనంతరం స్థానిక అధికారులు వ్యూపాయింట్ దిగువన ఉన్న ప్రాంతానికి యాక్సెస్‌ను మూసివేశారు.

ఇది నా ఫేవరెట్‌ స్పాట్.. నటి కెమిల్లా

ప్రమాదం జరిగిన ఈ ప్రదేశం పట్ల కెమిల్లా గతంలో తన ఇష్టాన్ని వ్యక్తం చేస్తూ.. దీనిని భూమిపై అత్యుత్తమ ప్రదేశంగా పేర్కొంది. చాలా సార్లు అక్కడికి వచ్చినట్లు తెలిపింది. ఈ ద్వీపంపై తనకున్న అభిరుచిని తెలుపుతూ పలుమార్లు సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా పెట్టింది. ‘స్యామ్యూయ్ ద్వీపం అంటే నాకు చాలా ఇష్టం. ఈ ప్రదేశం, బీచ్‌ ఒడ్డున చదునైన పెద్ద రాళ్లు నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమమైన స్థలం ఇదే. ఇక్కడికి వస్తే చాలా సంతోషంగా ఉంటుంది’అని తన పోస్టులో తెలిపింది. చివరకు తన ఫేవరెట్‌ స్పాట్‌లోనే మృత్యుఒడికి చేరింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!