Pic of the Day: మరికాసేపట్లో వివాహం.. పీటలపై పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడో చూస్తే నవ్వాగదు! వైరల్‌ పిక్‌

బంధువులు, స్నేహితులతో ఆ పెళ్లి మండపం కళకళలాడుతుంది. మరికాసేపట్లో మాంగళ్యధారణ జరనుంది. పురోహితుడు బిజీగా మంత్రాలు ఉచ్ఛరిస్తున్నాడు. అయితే పీటలపై కూర్చున్న పెళ్లి కొడుకు ధ్యాసంతా వేరే చోట ఉంది. మండపం వెనుక..

Pic of the Day: మరికాసేపట్లో వివాహం.. పీటలపై పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడో చూస్తే నవ్వాగదు! వైరల్‌ పిక్‌
Groom Plays Ludo On Phone During Wedding
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 02, 2024 | 12:46 PM

ఎవరి జీవితంలోపైనా జరిగే అత్యంత ముఖ్యమైన ఘట్టాల్లో పెళ్లి ముచ్చట ఒకటి. చిరకాలం గుర్తుండి పోయేలా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. తమ స్థాయికి తగ్గట్టు పెళ్లి తంతులో ప్రతిదీ ప్రత్యేకంగా ఎంతో శ్రద్ధతో ఏర్పాట్లు చేస్తుంటారు. అలాగే పెళ్లిళ్లలో సరదా పనులు చేసే వారు కూడా ఉంటారు. పెళ్లికి వచ్చిన బంధుజనం సాధారణంగా చిలిపినులు చేస్తూ అందరినీ ఆటపట్టిస్తుంటారు. అయితే ఈ వివాహ వేడుకలో మాత్రం చేయాల్సిన అల్లరి అంతా పెళ్లి కొడుకే కానిచ్చేస్తున్నాడు.

మరికాసేపట్లో పెళ్లి. బంధువుల హడావుడి, పిల్లల సందడితో మండపం అంతా కలకలలాడుతోంది. మరికాసేపట్లో మంగళ ధారణ జరగనుండగా.. మండపంలో పీటలపై కూర్చున్న పెళ్లి కొడుకు మాత్రం వేరే పనిలో యమ బిజీగా ఉన్నాడు. తన ముందున్న పురోహితుడు వేద మంత్రాలు చదువుతుంటే మండపం వెనుక ఇతగాడు చేసిన పని అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఇంతకీ ఏం చేశాడంటే.. పీటలపై కూర్చున్న పెళ్లి కొడుకు మండపంపైనే వెనుకకు తిరిగి ఫోన్‌లో ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడుతూ కనిపించాడు. మండపం వెనుక ఉన్న తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఫోన్‌లో లూడో గేమ్‌ ఆడుతూ ముందు జరుగుతున్న పెళ్లి తంతును మర్చిపోయాడు. ఈ దృశ్యం కెమెరాకు చిక్కడంతో.. ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే అది కాస్తా వైరల్గా మారింది. ఇక ఈ ఫొటో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్‌ చేస్తూ.. రెచ్చిపోతున్నారు. ‘బ్రోకి తన ప్రయారిటీస్‌ తనకు ఉన్నాయంటూ’ కామెంట్లు పెడుతున్నారు. వరుడు ఊహించని రీతిలో వినోదంలో మునిగిపోవడం చూసి నెటిజన్లు నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ ఫొటో మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక పెళ్లి వేడుకల్లో జరిగే ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలూ నెట్టింట తెగ వెరల్‌ అవుతుంటాయన్న సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.