Stomach Surgery: కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన మహిళ.. సీటీ స్కాన్ రిపోర్టులో షాకింగ్‌ సీన్‌! ఇంతకీ ఏం జరిగిందంటే

ఓ మహిళ కడుపు నొప్పితో విలవిలలాడుతూ ఆస్పత్రికి వచ్చింది. వైద్యులు కొన్ని మందులు ఇచ్చారు. అయినా నొప్పి తగ్గలేదు. దీంతో చివరకు సీటీ స్కాన్ చేశారు. స్కాన్ రిపోర్టు వచ్చాక చూస్తే అందులో కనిపించింది చూసి డాక్టర్లు షాక్ కు గురయ్యారు. ఇంతకీ అందులో ఏముందంటే..

Stomach Surgery: కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన మహిళ.. సీటీ స్కాన్ రిపోర్టులో షాకింగ్‌ సీన్‌! ఇంతకీ ఏం జరిగిందంటే
Scissors In Stomach
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 01, 2024 | 12:08 PM

భోపాల్‌, డిసెంబర్‌ 1: ఓ మహిళ రెండేళ్ల క్రితం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కడుపు సంబంధిత సమస్యతో ఆపరేషన్‌ చేయించుకుంది. అయితే ఆ ఆపరేషన్‌ చేసిన వైద్యుడు చేసిన పనికి ఆమె రెండేళ్ల నుంచి నరకయాతన అనుభవించింది. వివరీతమైన కడుపు నొప్పితో బాధపడింది. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోవడంతో తాజాగా మరో వైద్యుడి వద్దకు వెళ్లగా.. అక్కడ సిటీ స్కాన్‌ చేశారు. అయితే సిటీ స్కాన్‌లో ఆమె కడుపులో ఉన్నది చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సౌంధ గోహద్‌లో నివసించే 44 ఏళ్ల కమలా బాయికి రెండేళ్ల కిందట గ్వాలియర్‌లోని ప్రముఖ కమల రాజా హాస్పిటల్‌లో ఆపరేషన్ చేశారు. అప్పటి నుంచి ఆమె తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడింది. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోవడంతో డాక్టర్లు గత శుక్రవారం ఆమెకు సీటీ స్కాన్‌ చేశారు. స్కాన్‌ రిపోర్టులో ఆమె కడుపులో కత్తెర ఉండటం చూసి దిగ్భ్రాంతి చెందారు. రెండేళ్ల కిందట ఆ మహిళకు సర్జరీ చేసిన వైద్యులు పొరపాటున ఆ కత్తెరను ఆమె కడుపులో మరిచి కుట్లేసి ఉంటారని అనుమానించారు. దీంతో వెంటనే వైద్యులు ఆమెకు సర్జరీ చేసి, ఆ కత్తెరను తొలగించారు.

Scissors In Stomach

Scissors In Stomach

స్కాన్‌ ఇన్‌ఛార్జ్‌ సతీష్‌ శర్మ మాట్లాడుతూ.. మహిళ కడుపులో లోహపు వస్తువు కనిపించిందని, అది కత్తెరగా తేలిందని తెలిపారు. మరోవైపు రెండేళ్ల క్రితం తనకు ఆపరేషన్ చేసిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కమలా బాయి కుటుంబీకులు డిమాండ్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే కమల బాయికి ఇంత బాధ అనుభవించిందని కుటుంబీకులు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయి నివేదిక రూపొందించి ఉన్నతాధికారులకు పంపుతామని జిల్లా ఆసుపత్రి అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.