Indian Railways : రైలు చివ‌రి బోగి వెనుక ఇలాంటి X గుర్తు ఎందుకు రాసి ఉంటుందో తెలుసా..?

వాతావరణం అనుకూలించకోయినా, దట్టమైన పొగమంచులో ఇవి ప్రత్యేకంగా సహాయపడతాయి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో రైలును స్పష్టంగా చూడటం చాలా కష్టం. కాబట్టి అలాంటి సమయాల్లో రైలు వెనుక ఉన్న ఈ గుర్తులు ఎంత దూరంలో ఉన్నప్పటికీ సులువుగా కనిపిస్తుంటాయి. 

Indian Railways : రైలు చివ‌రి బోగి వెనుక ఇలాంటి X గుర్తు ఎందుకు రాసి ఉంటుందో తెలుసా..?
X Symbol Train Mea
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 02, 2024 | 7:20 PM

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒకటైమ్‌లో రైలులో ప్రయాణించే ఉంటారు.. మీరు రైల్లో ప్రయాణం చేయకపోయినా, కనీసం రైలు ప్రయాణాన్ని, రైలును చూసే ఉంటారు. ఆ సమయంలో రైలు బండిలపై కొన్ని సంకేతాలు ఉండటం గమనించారా..! ఇటువంటి సంకేతాలకు దేనికదే ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుందని మీకు తెలుసా..? రైల్వేలో రాసి ఉన్న కొన్ని గుర్తుల గురించిన సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

భారతదేశంలో నడుస్తున్న అన్ని ప్యాసింజర్ రైళ్ల చివరి కంపార్ట్‌మెంట్‌లో పెద్ద ‘X’ గుర్తు ఉండటం మీరు గమనించి ఉండవచ్చు. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, అన్ని ప్యాసింజర్ రైళ్ల చివరి క్యారేజ్‌లో ఈ మార్కింగ్ తప్పనిసరి. ప్రయాణీకుల సౌకర్యార్థం రైళ్లలో ఈ పెద్ద X సింబల్‌ రాసి ఉంటుంది. అది కూడా ఆ రైలు చివరి కంపార్ట్‌మెంట్‌కు రాసి ఉంటుంది. దానిపై ఎల్వీ అని రాసి ఉంటుంది. LV పూర్తి రూపం అంటే ‘లాస్ట్ వెహికల్’. ఇది రైలు చివరి కంపార్ట్‌మెంట్‌లో భద్రత కోసం వ్రాసిన రైల్వే కోడ్. ఇది రైలు చివరి కోచ్ అని కూడా రైల్వే ఉద్యోగులకు తెలియజేస్తుంది.

దానికి తోడు రైలు వెనుక రెడ్ లైట్ ఉంటుంది. ఈ లైట్ ట్రాక్‌పై పనిచేసే ఉద్యోగులకు వారు అదే స్థలం నుండి వెళ్లిపోయినట్లు సూచన ఇస్తుంది. వాతావరణం అనుకూలించకోయినా, దట్టమైన పొగమంచులో ఇవి ప్రత్యేకంగా సహాయపడతాయి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో రైలును స్పష్టంగా చూడటం చాలా కష్టం. కాబట్టి అలాంటి సమయాల్లో రైలు వెనుక ఉన్న ఈ గుర్తులు ఎంత దూరంలో ఉన్నప్పటికీ సులువుగా కనిపిస్తుంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..