మద్యం ప్రియులారా..! భారతదేశంలో నంబర్‌1 బీర్ బ్రాండ్ ఏదో మీకు తెలుసా..?

భారతదేశంలో మద్యం ప్రియులకు కొదవలేదు. విస్కీ, రమ్, స్కాచ్, వోడ్కా మొదలైన అనేక రకాల మద్యం రకాలకు మందుబాబుల కోసం అందుబాటులో ఉన్నాయి. అయితే వేసవిలో ఎక్కువగా బీర్ తాగడానికి ఇష్టపడతారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఏ బీర్ బ్రాండ్ ప్రసిద్ధి చెందిందో మీకు తెలుసా?

మద్యం ప్రియులారా..! భారతదేశంలో నంబర్‌1 బీర్ బ్రాండ్ ఏదో మీకు తెలుసా..?
Beer
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 02, 2024 | 7:44 PM

ప్రస్తుతం ఎన్నో కొత్త రకాల బీర్లు మార్కెట్లో ఎంట్రీ ఇస్తున్నా భారతదేశంలో ఒక్క బ్రాండ్ బీరే ఎక్కువగా అమ్ముడుపోతోంది. ఇదే ఆల్‌ ఇండియాలో నంబర్.1 బీర్ బ్రాండ్‌గా పాపులర్ అయింది. అదే కింగ్‌ఫిషర్ ప్రీమియం బీర్. ఈ కింగ్‌ఫిషర్‌ను యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ తయారు చేసింది. భారతదేశంలో దీన్ని ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. 1978లో ప్రారంభించబడింది.

దాదాపు 5 దశాబ్దాలు గడుస్తున్నా దీని క్రేజ్‌, పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. ఇది ఇప్పటికీ చాలామంది మందుబాబుల ఫేవరెట్ డ్రింక్‌గా నిలుస్తోంది. కింగ్‌ఫిషర్ బీర్ ఇప్పుడు భారతదేశంలోనే కాకుండా 60కి పైగా దేశాల్లో అమ్ముడవుతోంది. ఇక కింగ్‌ఫిషర్ ప్రీమియం బీర్‌ తయారీ విషయానికి వస్తే.. ఈ బీర్‌ తయారీ కోసం మంచి క్వాలిటీ ఉండే మాల్టెడ్ బార్లీ , సాజ్ హాప్స్‌ తో తయారు చేస్తారు. ఈ సాజ్ హాప్స్‌లో యాసిడ్ కంటెంట్ చాలా తక్కువగా ఉపయోగించి తయారు చేస్తారట.

కార్ల్స్‌బర్గ్ లైట్ బీర్.. కార్ల్స్‌బర్గ్ గ్రూప్‌ను 1847లో బ్రూవర్ జెస్సీ జాకబ్‌సెన్ స్థాపించారు. జెస్సీ తన కొడుకు కార్ల్ జాకబ్సెన్ పేరు మీద బ్రాండ్ పేరు పెట్టాడు. 1970లో కంపెనీ టుబోర్గ్‌తో విలీనమైంది. ఈ రకం బీర్‌ తక్కువ కేలరీలను అందిస్తుంది. తృణధాన్యాలు, పండ్లను ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు… ఈ కార్ల్స్‌బర్గ్ లైట్ బీర్ తాగితే కేవలం 110 మాత్రమే శరీరంలోకి వెళ్తాయి. ఇక ఈ బీరులో 3.2 శాతం ఆల్కాహాల్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

హీనెకెన్ బీర్ భారతదేశంలో తయారు చేయబడదు. ఇది నేరుగా హాలండ్ నుండి వస్తుంది. ఇది ప్రత్యేకమైన ఈస్ట్, పండ్లతో తయారు చేస్తారు. హీనెకెన్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మద్యం కంపెనీ. 2012లో, హీనెకెన్ టేకిలా-ఫ్లేవర్ బీర్ డెస్పరాడోస్‌ను కొనుగోలు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పెళ్లి చేసుకున్న ముగ్గురు
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కుంకుమపువ్వు పాలు.. ఆరోగ్యానికి లాభాలు తెలిస్తే అస్సలూ వదలరు గురూ
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? సంచలన అధ్యయనం
పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే..
సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.. కట్ చేస్తే..
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు..? అధికారుల వైఫల్యమే కారణమా
తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులెవరు..? అధికారుల వైఫల్యమే కారణమా
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
డాకు మ‌హారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు..ఫిదా అవ్వాల్సిందే
అద్దిరిపోయే ఇంటీరియర్స్‌తో అద్భుతమైన ఇల్లు..ఫిదా అవ్వాల్సిందే
Team India: బుమ్రా స్థానంలో దూసుకొస్తోన్న నలుగురు..
Team India: బుమ్రా స్థానంలో దూసుకొస్తోన్న నలుగురు..
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. TGPSC
మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తాం.. TGPSC