Cyclone Fengal: తుఫాన్‌ బీభత్సం.. వరదలో చిక్కుకున్న కుక్క కోసం ఓ వ్యక్తి సాహసం..!

ఈ నేపథ్యంలో వరదల్లో చిక్కుకుపోయిన కుక్కను ఓ వ్యక్తి కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తీవ్ర వాయుగుండం నవంబర్ 30న పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకింది. ఆదివారం నాటికి అది బలహీనపడినప్పటికీ, భారీ వర్షపాతం కారణంగా రెండు రాష్ట్రాలు స్తంభించిపోయాయి.

Cyclone Fengal: తుఫాన్‌ బీభత్సం.. వరదలో చిక్కుకున్న కుక్క కోసం ఓ వ్యక్తి సాహసం..!
Rescued Dog
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 02, 2024 | 8:54 PM

ఫెయింజల్ తుఫాను కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫెంగల్‌ తుఫాను ప్రభావంతో కురిసిన కుండపోత వర్షాలకు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అతలాకుతలమైంది. దీంతో అక్కడ వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వరదల్లో చిక్కుకుపోయిన కుక్కను ఓ వ్యక్తి కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తీవ్ర వాయుగుండం నవంబర్ 30న పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకింది. ఆదివారం నాటికి అది బలహీనపడినప్పటికీ, భారీ వర్షపాతం కారణంగా రెండు రాష్ట్రాలు స్తంభించిపోయాయి.

శనివారం ఉదయం నుంచి ఆదివారం వేకువజాము 5.30 గంటల వరకు 51 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పుదుచ్చేరి నగరంతోపాటు చుట్టూ ఉన్న గ్రామాలు సైతం నీటమునిగాయి. దీంతో పాఠశాలలు, కళాశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం తెలిపారు. పలు ప్రాంతాల్లో ఇళ్ల చుట్లూ రెండడుగుల ఎత్తున నీరు నిలిచి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

తమిళనాడు రాజధాని చెన్నైలోనూ సుమారు 350 ప్రాంతాలు జలమయమై వాహనాల రాకపోకలు స్తంభించాయి. విల్లుపురం, కడలూరు జిల్లాలపై తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. ఆ రెండు జిల్లాల్లో జనావాస ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..