AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో పుదీనా చట్నీతో హెల్త్ మ్యాజిక్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

Pudina Chutney Benefits: వేసవిలో పుదీనా శరీరాన్ని చల్లబరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అడాప్టోజెన్ గుణాలు కలిగిన పుదీనా.. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-సి, ఫైబర్‌తో నిండి ఉంటుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడటానికి పుదీనా చట్నీని తినమని, పుదీనా పానీయాలు తాగమని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు.

Janardhan Veluru
|

Updated on: Apr 06, 2026 | 4:23 PM

Share
వేసవిలో అధిక ఉష్ణోగ్రతల నుండి మన శరీరాన్ని రక్షించుకోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పుదీనా (Mint Leaves) అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కాలంలో ఏది పడితే అది తినడం ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అందుకే పుదీనాతో చేసే వంటకాలు, ముఖ్యంగా పుదీనా చట్నీని తీసుకోవడం వల్ల ఆరోగ్యం, చల్లదనం లభిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పుదీనా పానీయాలు వేసవిలో మన శరీరానికి ఉపశమనం కలిగిస్తాయి.

1 / 6
పుదీనా ఆకుల్లో అడాప్టోజెన్ గుణాలు ఉంటాయి. ఇవి వేసవిలో శరీరాన్ని చల్లబరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పుదీనాలోని శీతలీకరణ శక్తి శరీరంలోని వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. వేసవిలో చల్లగా ఉండటానికి చాలామంది చల్లటి పదార్థాలను ఆశ్రయిస్తారు. కానీ అవి కొన్నిసార్లు ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చు. అలాంటి సందర్భాల్లో, రుచి, ఆరోగ్యం రెండింటినీ పుదీనా వంటకాలు, పానీయాలు అందిస్తాయి.

2 / 6
ఆహారపు రుచిని పెంచే పుదీనా చట్నీని వేసవిలో ఎక్కువగా తినమని ఆరోగ్య నిపుణులు ప్రత్యేకంగా సిఫార్సు చేస్తారు. ఇది కేవలం రుచి కోసమే కాకుండా, కడుపు ఆరోగ్యానికి కూడా మంచిదని నమ్ముతారు. పుదీనా చట్నీ కడుపు ఆరోగ్యానికి ప్రయోజనకరమైన ఔషధంగా పరిగణించబడుతుంది. ఇది శరీరాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా వేసవిలో జీర్ణక్రియ, ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

3 / 6
పుదీనాలో సహజసిద్ధంగా యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-సి, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పిప్పర్ మెంట్ లోని శీతలీకరణ శక్తి పేగు ఆరోగ్యాన్ని శాంతపరచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, దీనిలోని యాంటీ-బాక్టీరియల్, యాంటీ-సెప్టిక్ లక్షణాలు పేగు సూక్ష్మజీవులను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడతాయి.

4 / 6
పుదీనా చట్నీలో విటమిన్-సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఈ సాంప్రదాయ చట్నీ తయారీలో ఉపయోగించే మూలికలు, సుగంధ ద్రవ్యాల మిశ్రమం పేగు ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది.ఇంట్లో పుదీనా చట్నీని తయారు చేసుకోవడం చాలా సులభం.

5 / 6
ముందుగా పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో నానబెట్టి, ఆపై వడకట్టి బాగా కడగాలి. ఆ తర్వాత ఒక బ్లెండర్ తీసుకుని అందులో పుదీనా ఆకులు, మూడు వెల్లుల్లి రెబ్బలు, ఒక అంగుళం అల్లం, రెండు పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. చాట్ మసాలాతో పాటు ఉప్పు, ఎండుమిర్చి, నిమ్మరసం జోడించి మళ్లీ బ్లెండ్ చేసి తాజా చట్నీని ఆస్వాదించండి. వేసవిలో ఈ చట్నీని ఫ్రిడ్జ్లో నిల్వ చేసి చాలా రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు.

6 / 6
Follow Us