AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: పచ్చిమిర్చి కడిగేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే తిన్నా వేస్టే!

పచ్చిమిర్చి కేవలం కారానికే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇందులో మన శరీరానికి అవసరమైన విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లను కూడా పుష్కలంగా ఉంటాయి. కానీ చాలా మంది వాటిని శుభ్రం చేసే విషయంలో చాలా తప్పులు చేస్తారు. సరిగ్గా కడగకుండా వండుతూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా వాటిపై ఉన్న బ్యాక్టీరియా ఆహారంలో చేరి మిమ్మల్ని అనారోగ్యం బారీన పడేలా చేస్తాయి కాబట్టి. పచ్చిమిర్చీని కూరలో యాడ్ చేసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

Kitchen Hacks: పచ్చిమిర్చి కడిగేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే  తిన్నా వేస్టే!
How To Clean Green Chilies
Anand T
|

Updated on: Apr 07, 2026 | 10:15 AM

Share

చాలా మంది వంటకు ముందు పచ్చిమిర్చి ఎక్కువ సేపు వాటర్ నానబెడతారు. కానీ ఇలా నీళ్లలో ఎక్కువ సేపు నానబెట్టడం వల్ల బ్యాక్టీరియా లోపలికి వెళ్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మిర్చిపై ఏవైనా గీతలు ఉంటే అవి త్వరగా కుళ్ళిపోతాయి. అలాగే కడిగే ముందు తొడిమలను తొలగించకూడదు. అలా చేస్తే నీరు, మురికి లోపలి గింజల వరకు వెళ్లి ఫంగస్ పట్టేలా చేస్తుంది. అందుకే కడిగి ఆరబెట్టిన తర్వాతే తొడిమలు తీయాలి. అలాగే పచ్చిమిర్చి ఎప్పుడూ వేడి నీటితో కడగవద్దు ఇలా చేయడం ద్వారా దానిపై పొర దెబ్బతింటుంది. వీటిని మళ్లీ స్టోర్ చేస్తే అవి మెత్తబడి, నల్లగా మారుతాయి

కడగడానికి సరైన పద్ధతి

పచ్చిమిల్చి చెడిపోకుండా ఉండాలంటే ఒక పాత్రలో సాధారణ నీటిని తీసుకుని, అందులో ఒక టీస్పూన్ ఉప్పు, కొంచెం తెల్ల వెనిగర్ వేసి కలపండి తర్వాత ఈ నీటిలో పచ్చిమిర్చిని వేసి కేవలం 2 నుండి 3 నిమిషాల పాటు ఉంచి, ఆపై శుభ్రమైన నీటితో కడగండి. ఉప్పు, వెనిగర్ సహజ క్రిమిసంహారిణులుగా పనిచేసి పురుగుమందుల అవశేషాలను తొలగిస్తాయి.

నిల్వ చేసే విధానం

కడిగిన వెంటనే పచ్చిమిర్చిని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. తేమ వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే వీటిని ఒక పొడి కాటన్ బట్టపై లేదా టిష్యూ పేపర్ మీద వేసి పూర్తిగా ఆరనివ్వాలి. పచ్చిమిర్చిని నిల్వ చేయడానికి గాలి చొరబడని డబ్బాను వాడండి. డబ్బా అడుగున ఒక టిష్యూ పేపర్ వేయడం వల్ల అదనపు తేమను అది పీల్చుకుంటుంది. నిల్వ చేసే ముందు పండిపోయిన లేదా కుళ్ళిపోయిన మిర్చి ఉంటే వాటిని వేరు చేయండి. ఒక్క పాడైన మిర్చి ఉన్నా అది మిగతా వాటన్నింటినీ పాడు చేస్తుంది. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల పచ్చిమిర్చి ఎక్కువ కాలం తాజాగా ఉండటమే కాకుండా, వాటిలోని పోషకాలు కూడా అలాగే ఉంటాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..