AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకున్నవాళ్లకు ఈ రెండు విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు..

బంగారు రుణాలపై ప్రభుత్వం తెచ్చిన కొత్త రూల్స్ ఏంటి? రూ. 2.2 లక్షల పైన లోన్ తీసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి? రూ. 2.2 లక్షలు దాటితే ఐటీ వివరాలు తప్పనిసరి. మీరు మోసపోకుండా ఉండాలంటే పాటించాల్సిన జాగ్రత్తలు ఇక్కడ చూడండి.

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకున్నవాళ్లకు ఈ రెండు విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు..
Gold Loan
Ravi Kiran
|

Updated on: May 02, 2026 | 7:59 AM

Share

మనం సాధారణంగా ఇంట్లో ఉన్న బంగారం పట్టుకెళ్లి బ్యాంకులో పెడితే వెంటనే లోన్ వచ్చేస్తుందని అనుకుంటాం. కానీ ఇప్పుడు రూ. 2.2 లక్షల కంటే ఎక్కువ రుణం కావాలంటే ఆదాయపు పన్ను వివరాలు, జీఎస్టీ, ఆధార్ కార్డు వంటివి తప్పనిసరి చేశారు. అక్రమ బంగారాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా లోన్-టు-వాల్యూ నిష్పత్తిలో కూడా స్లాబులు వచ్చాయి. మీరు తక్కువ లోన్ తీసుకుంటే ఎక్కువ శాతం (85 శాతం) డబ్బు వస్తుంది, కానీ లోన్ మొత్తం పెరిగే కొద్దీ ఈ శాతం 75 శాతానికి తగ్గిపోతుంది. అంటే ఎక్కువ లోన్ కావాలంటే ఎక్కువ బంగారం తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. ఇక వడ్డీ రేట్ల విషయానికి వస్తే, జాతీయ బ్యాంకుల్లో 7.5 శాతం నుంచే ప్రారంభం అవుతుండగా, ప్రైవేట్ సంస్థల్లో ఇది 24 శాతం వరకు వెళ్లవచ్చు. కాబట్టి లోన్ తీసుకునే ముందే వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు సరిచూసుకోవాలి.

లోన్ తీసుకునేవారు తప్పక తెలుసుకోవాల్సింది..

వడ్డీ రేట్ల వివరాలు:

బ్యాంకులు, NBFCల మధ్య వడ్డీ రేట్లలో భారీ వ్యత్యాసం ఉంటుంది(7.5 శాతం నుంచి 24 శాతం వరకు). సాధ్యమైనంత వరకు జాతీయ బ్యాంకులను ఎంచుకోవడం వల్ల తక్కువ వడ్డీకే లోన్ లభిస్తుంది.

వేలం ముప్పు:

ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే, బ్యాంకులు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే మీ బంగారాన్ని వేలం వేసే హక్కును కలిగి ఉంటాయి. కాబట్టి గడువు లోపు చెల్లింపులు పూర్తి చేయాలి.

ధరల హెచ్చుతగ్గులు:

మార్కెట్‌లో బంగారం ధర తగ్గితే, బ్యాంకులు అదనపు సెక్యూరిటీని అడగవచ్చు. మీ ఫోన్‌కి వచ్చే వాట్సాప్ లేదా ఎస్ఎంఎస్ నోటీసులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.

హిడెన్ ఛార్జీలు:

ప్రాసెసింగ్ ఫీజు, వాల్యుయేషన్ ఛార్జీల పేరుతో బ్యాంకులు అదనపు వసూళ్లు చేస్తాయి. లోన్ తీసుకునే ముందే వీటన్నింటిపై స్పష్టత తీసుకోవాలి.

బంగారం నాణ్యత చెకింగ్:

లోన్ తీరిన తర్వాత మీ నగలను తిరిగి తీసుకునేటప్పుడు.. మీరు పెట్టిన క్యారెట్ల బంగారం(ఉదాహరణకు 22ct లేదా 24ct) అంతే ఉందా? లేదా ఏవైనా మార్పులు జరిగాయా? అని క్షుణ్ణంగా చెక్ చేసుకోవాలి.

Also Read: EMI లేకుండా 5 ఏళ్లు ఇలా చేస్తే రూ. 50 లక్షల ఇల్లు మీ సొంతం.. చాలామందికి ఇది తెలియక తన్నుకుంటున్నారు

Follow Us
ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం..
ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం..
అప్పుడు తోపు నటుడు.. ఇప్పుడు వాచ్‌మెన్‌గా..
అప్పుడు తోపు నటుడు.. ఇప్పుడు వాచ్‌మెన్‌గా..
పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. పండుగల సమయంలో రైతులకు ఇదే పరమాన్నం
పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. పండుగల సమయంలో రైతులకు ఇదే పరమాన్నం
వారెవ్వా.. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారిని గాల్లోనే..
వారెవ్వా.. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారిని గాల్లోనే..
మీరేం మనుషులురా..? అప్పు ఇవ్వలేదని ఫ్రెండ్‌నే చంపేశారు..
మీరేం మనుషులురా..? అప్పు ఇవ్వలేదని ఫ్రెండ్‌నే చంపేశారు..
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..
దుబాయ్ ప్రమాద బాధితులకు అండగా షంషీర్.. ఏకంగా రూ. 2.6 కోట్ల..
వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ
వానల్లో ఘాటుగా, పుల్లటి రుచి కావాలనుకునేవారికి అదిరిపోయే రెసిపీ