AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జల పుష్పాలతో జిగేల్ జిగేల్.. చేపలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే..

చేపలు మన శరీరానికి అవసరమైన పోషకాల గని. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మెదడు పనితీరును పెంచడం, డిప్రెషన్‌ను తగ్గించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేపలు అందిస్తాయి. విటమిన్ డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే చేపలు కంటి చూపును మెరుగుపరిచి, జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి.

జల పుష్పాలతో జిగేల్ జిగేల్.. చేపలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే..
Fish
Shaik Madar Saheb
|

Updated on: Apr 07, 2026 | 3:07 PM

Share

చేపలు.. మంచి ఫుడ్.. నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తింటారు.. అయితే.. చాలామంది చేపలు కేవలం ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారంగా భావిస్తారు. అయితే, చేపలలో ప్రోటీన్లతో పాటు అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. చేపలను ఈ భూమిపై అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలలో ఒకటిగా పరిగణిస్తారు. వీటిని తినడం ద్వారా.. ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.. చేపలు తినడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

చేపల్లో ముఖ్యమైన పోషకాలు..

చేపలలో అధిక నాణ్యత గల ప్రోటీన్, అయోడిన్, విటమిన్లు, మినరల్స్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. కొవ్వు కలిగిన చేపలలో విటమిన్ డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా లభిస్తాయి. ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మన మెదడు పనితీరు సరిగ్గా జరగడానికి, అనేక రకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. శరీరంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమతుల్యత కోసం చేపలను వారానికి కనీసం రెండు సార్లు తినడం మంచిది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: చేపలు తినడం వల్ల గుండెపోటు, స్ట్రోక్స్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఈ రోజుల్లో 45 నుండి 50 సంవత్సరాల వయస్సు వారిలో గుండెపోటు, స్ట్రోక్స్ మరణాలకు ముఖ్య కారణాలుగా ఉంటున్నాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఇటువంటి సమస్యలు రాకుండా నివారించడానికి చేపలు ఉత్తమ ఆహారం. ఆసుపత్రులు, మందుల కోసం వేల ఖర్చు చేసే బదులు, వారానికి ఒక్కసారైనా చేపలు తినడం వల్ల ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించుకోవచ్చు.

గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్‌కు మద్దతు: చేపలలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పెరుగుదల, అభివృద్ధికి దోహదపడతాయి. ముఖ్యంగా మెదడు అభివృద్ధికి, కంటి అభివృద్ధికి ఇవి బాగా ఉపయోగపడతాయి. గర్భిణులు, పాలిచ్చే తల్లులకు చేపలు ఎంతో మంచివి.

మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది: మన వయస్సు పెరిగే కొద్దీ మెదడు పనితీరు తగ్గుతుంది, దీనిని మనం మతిమరుపు అంటాం. చేపలను ఎక్కువగా తినేవారిలో మతిమరుపు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ రోజుల్లో 35 నుండి 40 సంవత్సరాలకే మతిమరుపు ప్రారంభమవుతున్నందున, ముందు నుంచే చేపల వినియోగాన్ని పెంచుకోవడం వల్ల ఈ సమస్యలను నివారించవచ్చు.

డిప్రెషన్‌ను నివారిస్తుంది: ఈ రోజుల్లో డిప్రెషన్ ఒక సాధారణ సమస్యగా మారింది. డిప్రెషన్ చాలా ప్రమాదకరమైనది. చేపలు తినడం వల్ల డిప్రెషన్ రాకుండా ఉండటమే కాకుండా, ఇప్పటికే డిప్రెషన్‌తో బాధపడుతున్న వారికి చికిత్స చేయడంలోనూ సహాయపడుతుంది. చేపలలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ డిప్రెషన్‌ను తగ్గిస్తాయి. యాంటీ డిప్రెసెంట్ మందులు తీసుకుంటున్న వారికి, ఆ మందులు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి ఇవి ఉపయోగపడతాయి.

విటమిన్ డికి మంచి మూలం: చేపలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు.. దీనికి విటమిన్ డి లోపమే ప్రధాన కారణం. విటమిన్ డి సప్లిమెంట్లు వాడే బదులు, చేపల రూపంలో సహజసిద్ధంగా లభించే విటమిన్ డిని పొందవచ్చు.

కంటి చూపును మెరుగుపరుస్తుంది: చిన్న వయస్సు వారి నుండి పెద్ద వయస్సు వారి వరకు కళ్ళజోళ్ళు వాడుతున్న ప్రస్తుత కాలంలో, చేపలు కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్.. సమస్యలు వచ్చాక బాధపడటం కన్నా రాకుండా చూసుకోవడం మంచిది కదా. ఇవే కాకుండా, చేపలలో విటమిన్ బి2, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. ఇన్ని పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చేపలను మన ఆహారంలో భాగం చేసుకోవడం తెలివైన పని.. ఈ రోజుల్లో చేపలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. కావున వారిని ఒక్కసారైనా తినాలని డైటీషియన్లు సూచిస్తున్నారు.

దివ్యాస్త్రం.. ఈ మొక్క ఉంటే డాక్టర్ అవసరమే ఉండదు.. మీ ఇంట్లో ఇలా ఈజీగా పెంచుకోండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us