రోజుకో గుప్పెడు పెసలు తింటే..ఈ వ్యాధులన్నీ పరార్!

30 April 2026

Jyothi Gadda

పెసర్లను చాలా మంది మొలకలుగానే తింటుంటారు. కానీ వీటిని ఎన్నో విధాలుగా తినొచ్చు. కానీ వీటిని తినడం వల్ల మీరు పొందే లాభాలు ఒకటి రెండు కావు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే గింజ కూడా వదలరు!

పెసర్లు మంచి పోషకాల గని. ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B6, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

పెసర్లను తింటే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెసర్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.

పెసర్లలో మెగ్నీషియం, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. ఇవి హైబీపీని నియంత్రించడానికి సహాయపడతాయి. దీంతో మీకు గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మీ గుండె హెల్తీగా ఉంటుంది.

సులభంగా జీర్ణమవుతుంది. ఇతర పప్పు ధాన్యాలతో పోలిస్తే పెసరపప్పు చాలా తేలికగా జీర్ణమవుతుంది. గ్యాస్ లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావు, అందుకే అనారోగ్యంతో ఉన్నవారికి కూడా దీనిని సూచిస్తారు.

పెసర్లలో ప్రోటీన్ తో పాటుగా ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అంటే ఈ పప్పును తింటే మీ కడుపు తొందరగా నిండుతుంది. ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారికి పెసర్లు బెస్ట్‌ అప్షన్‌.

పెసర పప్పులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. డయాబెటీస్ పేషెంట్లు ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. దీనని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. అలాగే షుగర్ అదుపులో ఉంటుంది.

పెసర్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం కాంతివంతంగా ఉండటానికి, జుట్టు దృఢత్వానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం రోజువారీ ఆహారంలో పెసరపప్పును చేర్చుకోవడం ఎంతో ఉత్తమం.