హాట్ సమ్మర్‌లో మీ ఆరోగ్యానికి బెస్ట్ ప్రోటీన్ ఏది? చికెన్ vs ఫిష్! Rajashekher

వేసవిలో నీరు తాగడంతోపాటు మీరు తినే ఆహారంపైనా శ్రద్ధ చూపించాలి. చేపలు లేదా చికెన్ తినడం.. ఏది ప్రయోజనమో చూద్దాం. 

వేసవిలో కోడి మాంసం కంటే చేపలు మంచి ఎంపిక. ఎందుకంటే అవి త్వరగా జీర్ణమవుతాయి. శరీరంలో అధిక వేడిని కలిగించవు. 

వేసవిలో చికెన్ ఎక్కువగా తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది శరీరానికి వేడిని అందించే ఆహారం. వేసవిలో దీన్ని తినడం వల్ల శరీరంలో మరింత వేడి పెరగవచ్చు. 

చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. కోడి మాంసంలోని కొవ్వు కంటే ఆరోగ్యకరమైనవి. 

వేసవిలో వేయించిన లేదా నూనెలో బాగా వేయించిన ఆహార పదార్థాలను తినకపోవడమే మంచిది. చేపలను కూరగా తినడం ఉత్తమం. తురిమిని పచ్చి కొబ్బరితో అయితే ఇంకా బాగుంటుంది. 

ఈ సమయంలో మీరు కోడి మాంసం తినాలనుకుంటే.. దానిని తక్కువ కారంతో లేదా సూప్ రూపంలో తినడం ఉత్తమం. 

వేసవిలో జీర్ణశక్తి బలహీనంగా ఉంటుంది. కాబట్టి.. ఎర్ర మాంసం, మసాలా చికెన్ వంటకాలు, ఇతర ఆహార పదార్థాలు అజీర్ణానికి కారణం కావచ్చు. వాటికి దూరంగా ఉండి. 

చికెన్, చేపలు తినేటప్పుడు, వాటితోపాటు సలాడ్ల రూపంలో పుష్కలంగా కూరగాయలను చేర్చుకోవాలి. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి సహాయపడుతుంది.