మీరు తినే పుచ్చకాయ మంచిదేనా? కల్తీ ఇలా గుర్తించండి

01 May 2026

TV9 Telugu

TV9 Telugu

పుచ్చకాయ లేనిదే వేసవిలో రోజు గడవదు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఈ పండును.. ఎండకాలంలో తినని వారుండరు

TV9 Telugu

కానీ, కొందరు కల్తీరాయుళ్లు.. పుచ్చకాయ ఎరుపు రంగులో ఆకర్షణీయంగా కనిపించడానికి ఎరిత్రోసిన్‌ అనే సింథటిక్‌ రంగును ఇంజెక్ట్‌ చేస్తున్నారు. దీనిని తింటే.. అనేక అనారోగ్య సమస్యలు రావడం ఖాయం 

TV9 Telugu

అయితే, ఈ కల్తీని ఇంట్లోనే చాలా సులభంగా గుర్తించవచ్చు. పుచ్చకాయను రెండు ముక్కలుగా కోయాలి. ఒక తెల్లని కాటన్‌ బాల్‌ (దూది) తీసుకుని.. పుచ్చకాయ లోపలి ఎర్రటి భాగంపై మెల్లగా రుద్దాలి

TV9 Telugu

ఒకవేళ దూదికి ఎరుపు రంగు అంటుకుంటే.. అందులో ఎరిత్రోసిన్‌ లాంటి కృత్రిమ రంగు కలిపారని అర్థం. సహజమైన పుచ్చకాయ రంగు.. దూదికి అంత త్వరగా అంటుకోదు. కాటన్‌ బాల్‌కు బదులుగా టిష్యూ పేపర్‌ కూడా వాడొచ్చు

TV9 Telugu

పుచ్చకాయలోని ఎర్రటి భాగాన్ని ఒక చిన్న ముక్కగా కోయాలి. ఒక గ్లాసు శుభ్రమైన నీటిని తీసుకొని, ఆ ముక్కను అందులో వేయాలి. 5-10 నిమిషాలపాటు అలాగే వదిలేయాలి

TV9 Telugu

నీరు వెంటనే గాఢమైన ఎరుపు రంగులోకి మారితే.. కల్తీ జరిగినట్లు గుర్తించాలి. సహజమైన పండు అయితే, నీరు రంగు మారడానికి చాలా సమయం పడుతుంది. అక్కడక్కడా ప్యాచీలుగా ఉంటే అనుమానించాల్సిందే

TV9 Telugu

పుచ్చకాయ పైన ఎక్కడైనా చిన్నచిన్న సూదితో గుచ్చినట్లు రంధ్రాలు ఉన్నాయేమో చూడాలి. ఇంజెక్షన్‌ ద్వారా రంగును లోపలికి పంపినప్పుడు ఇలాంటి గుర్తులు కనిపిస్తాయి

TV9 Telugu

సహజంగా పండిన పుచ్చకాయలో అక్కడక్కడా తెల్లటి పీచులాంటి చారలు ఉంటాయి. కల్తీ జరిగిన పండ్లలో ఇవి కూడా ఎరుపు రంగులోకి మారిపోతాయి