Weight Lose : బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా..! అయితే నల్ల మిరియాలు, పుదీనతో చేసిన టీ ప్రయత్నించండి..
Weight Lose : బరువు పెరగడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. కరోనా వల్ల లాక్‌డౌన్ విధించడంతో చాలామంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు.
Weight Lose : బరువు పెరగడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. కరోనా వల్ల లాక్‌డౌన్ విధించడంతో చాలామంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. దీంతో విపరీతంగా బరువు పెరుగుతున్నారు. అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. దీని నుంచి బయటపడటానికి ఇంట్లోనే చక్కటి చిట్కాలతో బరువు తగ్గించుకోవచ్చు. అందులో భాగంగా మిరియాలు, పూదీనతో చేసిన టీ చాలా మంచిది. ఏలా తయారుచేయాలో తెలుసుకుందాం.
1. ఈ స్పెషల్ డ్రింక్ చేయడానికి మీకు రెండు టీస్పూన్ల నల్ల మిరియాలు, తొమ్మిది నుంచి పది పుదీనా ఆకులు రెండు టీస్పూన్ల నిమ్మరసం అవసరం. మొదట రెండు గ్లాసుల నీరు తీసుకొని అందులో పుదీనా ఆకులు, నల్ల మిరియాలు కలపాలి. సుమారు ఇరవై నిమిషాలు గ్యాస్ మీద నీరు వేడి చేయాలి. తరువాత అందులో నిమ్మరసం కలిపి త్రాగాలి. ఈ నీరు మీరు ప్రతి ఉదయం తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
2. అలాగే మరో పద్దతిలో మెంతి, నల్ల మిరియాల టీ బాగా పనిచేస్తుంది. ఇంట్లో ఈ పానీయం తయారు చేయడానికి రెండు టీస్పూన్ల మెంతి, రెండు టీస్పూన్ నల్ల మిరియాలు అవసరం. రాత్రిపూట రెండింటినీ కలపి నీటిలో నానబెట్టండి. ఉదయం ఒక గ్లాసు వేడి నీటిలో దీనిని కలిపి గ్యాస్ మీద తక్కువ మంటపై పది నిమిషాలు మరిగించండి. తర్వాత వేడిగా ఉన్నప్పుడు త్రాగాలి.
3. ఏడు నుంచి ఎనిమిది మిరియాలు ఒక గ్లాసు నీరు తీసుకోండి. తక్కువ వేడి మీద నీటిని వేడి చేయండి. ఇరవై నుంచి ముప్పై నిమిషాలు నీరు మరగనివ్వండి. ఈ నీరు వేడిగా ఉన్నప్పుడు త్రాగాలి. రోజూ ఈ నీరు తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది జీవక్రియను పెంచడంతో పాటు కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలోని పోషకాలు మీ ఆకలిని శాంతపరుస్తాయి. బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.