- Telugu News Photo Gallery Cricket photos Australia bowler brad hogg picks team indias t20 world cup playing eleven here is the list
రోహిత్-విరాట్ ఓపెనర్లు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో సూర్యకుమార్ యాదవ్.. ఆసీస్ మాజీ బౌలర్ ఎంపిక చేసిన జట్టు ఇదే
యూఏఈ వేదికగా అక్టోబర్-నవంబర్ మధ్య టీ20 ప్రపంచకప్ 2021 జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే.
Updated on: Jul 14, 2021 | 2:04 PM

యూఏఈ వేదికగా అక్టోబర్-నవంబర్ మధ్య టీ20 ప్రపంచకప్ 2021 జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే.

అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుండగా, జట్లన్నీ కూడా దానికి తగ్గట్టగా సిరీస్‌లను లైనప్ చేసుకున్నాయి. ఈ తరుణంలో ఆసీస్ మాజీ బౌలర్ బ్రాడ్ హగ్.. భారత జట్టు వరల్డ్ కప్ టీమ్‌ను ఎంపిక చేశాడు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఓపెనర్లుగా, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, రిషబ్ పాంట్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలు మిడిల్ ఆర్డర్‌లో ఎంపిక చేశాడు. హార్దిక్, జడేజాలను ఆల్‌రౌండర్లుగా జట్టులోకి తీసుకున్నాడు.

మూడు స్పెషలిస్ట్ బౌలర్లను, ఓ స్పిన్నర్‌ను తన జట్టు బౌలింగ్ లైనప్‌లో ఎంపిక చేశాడు. శార్దుల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు, చాహల్‌ను తుది జట్టులోకి తీసుకున్నాడు.




