- Telugu News Photo Gallery Cricket photos Vamika photos virat kohli and anushka sharma daughter vamika viral photos
Vamika Photos: ముఖం చూపించకుండా ఫొటోలా.. వామికా ఫేస్ ఇంకెప్పుడు చూపిస్తారంటోన్న ఫ్యాన్స్!
Vamika Photos: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల కుమార్తె వామికా ముఖం చూపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో పంచుకున్న ఫొటోలలో వామికా ఫేస్ మాత్రం కనిపించక పోవడం గమనార్హం.
Updated on: Jul 13, 2021 | 8:03 PM

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల జంటకు 11 జనవరి 2021న తల్లిదండ్రులయ్యారు. ఈమేరకు సోషల్ మీడియాలో సమాచారం అందించిన సంగతి తెలిసిందే. విరుష్కల కుమార్తెకు వామికా అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే. కుమార్తె పుట్టిన సందర్భంగా ఆస్ట్రేలియా పర్యటన నుంచి కోహ్లీ విరామం తీసుకున్నాడు. కొద్ది రోజుల తరువాత కుమార్తె ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న ఈ జంట.. ఫేస్‌ను మాత్రం చూపించలేదు. అప్పటి నుంచి వామికా ఫేస్ కనిపించకుండా జాగ్రత్తలు పడుతున్నారు.

ఫ్యాన్స్ మాత్రం వామికా ముఖాన్ని చూపించాలని విరుష్కలను కోరుతూనే ఉన్నారు. కానీ, వారు అందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ప్రయాణంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కెమెరా కంటికి చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

జులై 11 న వామికాకు ఆరు నెలలు నిండాయి. ఈ సందర్భంగా అనుష్క శర్మతోపాటు విరాట్ కోహ్లీ, వామికా ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం విరుష్కలు ఇంగ్లండ్‌లో ఉన్నారు. లండన్‌లో విహరిస్తున్న ఈ జంట.. అక్కడే వామికా 6వ నెల పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.

తమ కుమార్తె గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సమాచారం అందిస్తూనే ఉన్నారు. వామికా రెండు నెలల వయసు నుంచి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

ఎయిర్ పోర్టులో కెమెరాల కంట చిక్కకుండా పూర్తిగా రక్షించుకుంటున్నారు. అయితే, అప్పుడప్పుడు వామికా ఫొటోలను విరుష్కలు షేర్ చేస్తూనే ఉన్నారు. కానీ, వామికా ఫేస్‌ను మాత్రం కనిపించనీయడం లేదు.

అనుష్క శర్మ షేర్ చేసిన ఓ ఫొటోకు 'నీ నవ్వు మా ప్రపంచాన్ని మొత్తం మార్చేస్తుంది. నీ ప్రేమతోనే మేము జీవిస్తున్నాం. మా ముగ్గురికి ఆరునెలల శుభాకాంక్షలు' అంటూ రాసుకొచ్చారు.



