- Telugu News Photo Gallery Cricket photos Ind vs sl sri lankan players who have taken the most runs and wickets against india in odis and t20s
IND vs SL: వన్డేలు, టీ20ల్లో భారత్‌పై అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన శ్రీలంక ప్లేయర్లు వీరే..!
భారత్‌తో వన్డే, టీ20 సిరీస్ ఆడే శ్రీలంక టీంను ఇంకా ప్రకటించలేదు. కానీ, ప్రస్తుత జట్టులో భారత్‌పై అద్భుతంగా ఆడిన ఈ ప్లేయర్లు కచ్చితంగా ఉంటారనడంలో సందేహం లేదు.
Updated on: Jul 13, 2021 | 3:57 PM

టీమిండియా, శ్రీలంక పరిమితి ఓవర్ల సిరీస్ కొత్త షెడ్యూల్ జులై 18 నుంచి ప్రారంభమవనుంది. సిరీస్‌లో మొదట వన్డే సిరీస్, తరువాత టీ20 సిరీస్ జరగనుంది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్డేడియంలో అన్ని మ్యాచులు జరగనున్నాయి. శ్రీలంక జట్టును ఇంత వరకు ప్రకటించలేదు. అయితే, భారత్‌పై అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్లను ఎంపిక చేస్తారనడంలో సందేహం లేదు. ప్రస్తుత జట్టులో ఉండబోయే వారిని మాత్రమే పరిగణలోకి తీసుకున్నాం.

వన్డేల పరంగా చూస్తే.. శ్రీలంక టీంలో అత్యధిక పరుగులు చేసిన వ్యక్తిగా కుసల్ పెరీరా నిలిచాడు. ఈ లంక ఆటగాడు భారత్‌పై ఇప్పటి వరకు 139 పరుగులు సాధించాడు.

వన్డే క్రికెట్‌లో భారత్‌పై అత్యధిక వికెట్లు తీసిన శ్రీలంక బౌలర్‌గా అకిలా ధనంజయ నిలిచాడు. భారత్‌తో ఆడిన వన్డేల్లో ఇప్పటివరకు 11 వికెట్లు పడగొట్టాడు.

ప్రస్తుత శ్రీలంక జట్టులో, భారత్‌పై అత్యధిక టీ 20 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ కూడా కుసల్ పెరెరానే. ఈ ఫార్మాట్‌లో భారత్‌పై కుసల్ 215 పరుగులు చేశాడు.

ప్రస్తుత శ్రీలంక జట్టులో, భారత్‌పై అత్యధిక టీ 20 వికెట్లు తీసిన బౌలర్‌గా డి.చమీరా నిలిచాడు.



