- Telugu News Photo Gallery Cricket photos Eng vs pak babar azam breaks many records for pakistan and beat virat kohli rohit sharma
ENG vs PAK: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల రికార్డులను బద్దలు కొట్టిన పాకిస్తాన్ కెప్టెన్..!
ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డు స్థాయిలో సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మల రికార్డులను చెరిపేశాడు.
Updated on: Jul 14, 2021 | 3:23 PM

ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డు స్థాయిలో సెంచరీ సాధించాడు. అతను 139 బంతుల్లో 158 పరుగులు చేశాడు. దీంతో అనేక పాత రికార్డులను బద్దలు కొట్టి, అనేక సరికొత్త రికార్డులను క్రియోట్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో బాబర్ ఆజం నాలుగు పెద్ద విజయాలను నమోదు చేశాడు. వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించాడు. ఇంగ్లాండ్‌పై పాకిస్థాన్‌కు అత్యధిక వన్డే ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ కెప్టెన్‌గా అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్‌పై ఏ కెప్టెన్ చేయని అత్యధిక స్కోరును కూడా చేశాడు.

పాకిస్తాన్ కెప్టెన్‌గా అత్యధిక స్కోరు సాధించిన షోయబ్ మాలిక్ రికార్డును బాబర్ అజామ్ బద్దలు కొట్టాడు. 2008 లో భారత్‌పై మాలిక్ అజేయంగా 125 పరుగులు చేశాడు. బాబర్ ఇంగ్లండ్‌పై 158 పరుగులు చేశాడు. అంతకుముందు బాబర్ కెప్టెన్‌గా జింబాబ్వేపై 125 పరుగులు పూర్తి చేశాడు. అతను ఇమామ్-ఉల్-హక్ ఇంగ్లాండ్‌పై చేసిన 151 పరుగుల రికార్డును కొల్లగొట్టాడు.

దక్షిణాఫ్రికాకు చెందిన గ్రేమ్ స్మిత్ కెప్టెన్‌గా ఇంగ్లండ్‌పై అత్యధిక స్కోరు సాధించిన రికార్డును బాబర్ అజామ్ కొల్లగొట్టాడు. స్మిత్ 2009 లో 141 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 2006 లో ఇంగ్లాండ్‌పై అజేయంగా 126 పరుగులు చేసిన శ్రీలంక ఆటగాడు మహేలా జయవర్ధనే మూడో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్‌లో వన్డే సెంచరీ చేసిన రెండో పాకిస్తాన్ కెప్టెన్‌గా బాబర్ నిలిచాడు. బాబర్ కంటే ముందు, ఇమ్రాన్ ఖాన్ 1983 లో ఈ ఘనత సాధించాడు. అంటే, 38 సంవత్సరాల తరువాత, పాకిస్తాన్ కెప్టెన్ బ్రిటిష్ గడ్డపై వన్డే సెంచరీ సాధించాడు.

158 పరుగుల ఇన్నింగ్స్‌తో బాబర్ ఆజం వన్డేల్లో పాకిస్తాన్ తరఫున అత్యధిక స్కోరు సాధించిన ఐదవ ఆటగాడిగా నిలిచాడు. 2018 లో జింబాబ్వేపై అజేయంగా 210 పరుగులు చేసిన ఫఖర్ జమాన్ పేరిట ఉంది. సయీద్ అన్వర్ 194, ఫఖర్ జమాన్ 193, ఇమ్రాన్ నజీర్ 160 బాబర్ కంటే ముందు వరుసలో ఉన్నారు. వన్డేల్లో 14 వన్డే సెంచరీలు సాధించిన వేగవంతమైన క్రికెటర్‌గా బాబర్ అజామ్ నిలిచాడు. అతను 83 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఈ విషయంలో అతను హషీమ్ ఆమ్లాను దాటేశాడు.

బాబర్ అజామ్ ఇంగ్లాండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో మంచి రికార్డులతో సాగిపోతున్నాడు. గత మూడు ఇన్నింగ్స్‌లలో 158, 101 నాటౌట్, 31 నాటౌట్‌గా నిలిచాడు. ఈ మైదానంలో బాబర్ సగటు 290గా ఉంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎడ్జ్‌బాస్టన్‌లో 111.66 సగటుతో రెండవ స్థానంలో నిలిచాడు. కేన్ విలియమ్సన్ 103.33 సగటుతో మూడవ స్థానంలో, రోహిత్ శర్మ 89.40 తో నాలుగవ స్థానంలో నిలిచారు.



