AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sumanth Akkineni: సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్న అక్కినేని హీరో.. దుల్కర్ సల్మాన్ మూవీలో కీలక పాత్రలో సుమంత్ ?

అక్కినేని నాగేశ్వరరావు కూతురి తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుమంత్ ఇప్పటి వరకు స్టార్‏డమ్ సంపాదించుకోలేకపోయాడు. మొదటి నుంచి సుమంత్ కెరీర్ ఒడిదుడుకుల మధ్యే సాగుతూ వస్తుంది.

Sumanth Akkineni: సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్న అక్కినేని హీరో.. దుల్కర్ సల్మాన్ మూవీలో కీలక పాత్రలో సుమంత్ ?
Sumanth
TV9 Telugu Digital Desk
| Edited By: Rajitha Chanti|

Updated on: Jul 14, 2021 | 1:57 PM

Share

అక్కినేని నాగేశ్వరరావు కూతురి తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుమంత్ ఇప్పటి వరకు స్టార్‏డమ్ సంపాదించుకోలేకపోయాడు. మొదటి నుంచి సుమంత్ కెరీర్ ఒడిదుడుకుల మధ్యే సాగుతూ వస్తుంది. ఆ తర్వాత సుమంత్ చేసిన కొన్ని చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నా.. ఆ తర్వాత మళ్లీ సుమంత్‏కు అనుకున్నన్ని అవకాశాలు రాలేకపోయాయి. దీంతో కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక తర్వాత సినిమాల్లో ఒకటి రెండు ముఖ్య పాత్రలు చేసినా… సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. ఇప్పటికీ సుమంత్ హీరోగా సూపర్ హిట్ అందుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇటీవల కపటదారి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అది కూడా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో సుమంత్ ఇక సినిమాల్లో రాణించడని.. మెల్ల మెల్లగా సినిమాలకు దూరం అవుతున్నాడంటూ వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే…తాజాగా సుమంత్ హీరోగా కాకుండా.. మరో కీలక పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే శ్రీకాంత్, జగపతి బాబు వంటి స్టార్‏లు హీరోలుగా కాకుండా.. తమ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో సుమంత్ కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నాడని సమాచరం. తమిళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా.. మహానటి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాలో సుమంత ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి అందాల రాక్షసి ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారట. ప్రస్తుతం హను రాఘవపూడి ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో ఉన్నాడట. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇందులో సుమంత్ పాత్ర ఎంతో ప్రాధాన్యత ఉంటుందని టాక్. ఇక ఇదే మూవీతో సుమంత్ సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేయనున్నట్లుగా అర్థమవుతుంది.

Also Read: రామ్ చరణ్ సినిమాకోసం రంగంలోకి దిగిన బుర్రా సాయిమాధవ్.. శంకర్ సినిమా డైలాగ్ రైటర్ గా..

Ram Charan : మెగా ఫ్యామిలీలో జాబ్ అంటే మామూలుగా ఉండదుగా..! చెర్రీ డ్రైవర్ జీతం ఎంతో తెలుసా..?

సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..