AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లోనే చిల్లీ ఎగ్స్ రెసిపీని చేయండి..! రెస్టారెంట్ రుచిని ఆస్వాదించండి..!

ఎగ్స్ తో చేసే వంటకాల్లో చిల్లీ ఎగ్స్ చాలా ప్రత్యేకమైనది. ఇది ఘాటుగా, క్రిస్పీగా, రెస్టారెంట్ స్టైల్‌లో రుచికరంగా ఉంటుంది. కొద్దిపాటి చిట్కాలు పాటిస్తే ఇంట్లోనే రెస్టారెంట్ రుచిని ఆస్వాదించొచ్చు. ఈ రెసిపీ పిల్లలు, పెద్దలందరికీ నచ్చేలా ఉంటుంది. సులభంగా తయారయ్యే ఈ వంటకాన్ని ఒకసారి ట్రై చేసి చూడండి.

ఇంట్లోనే చిల్లీ ఎగ్స్ రెసిపీని చేయండి..! రెస్టారెంట్ రుచిని ఆస్వాదించండి..!
Best Chilli Eggs Recipe
Prashanthi V
|

Updated on: Apr 01, 2025 | 9:38 AM

Share

ఎగ్ వంటకాలలో చిల్లీ ఎగ్స్ ఒక ప్రత్యేకమైన వంటకం. గుడ్లతో ఎన్నో రకాల రుచికరమైన వంటకాలు చేయవచ్చు, అయితే రెస్టారెంట్ స్టైల్లో తయారుచేసే చిల్లీ ఎగ్స్ అయితే మరింత ఘాటుగా, రుచిగా ఉంటుంది. ఇంట్లోనూ అదే రుచిని పొందాలంటే కొన్ని చిన్న చిట్కాలను పాటిస్తే చాలు. ఈ రుచికరమైన వంటకాన్ని ఓసారి ప్రయత్నిస్తే పిల్లలతో పాటు పెద్దలకూ కూడా ఎంతో నచ్చుతుంది. మరి ఇంట్లోనే రుచికరమైన చిల్లీ ఎగ్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్ల మిశ్రమం కోసం కావాల్సిన పదార్థాలు

  • గుడ్లు – 6
  • మైదా పిండి – 1.5 టేబుల్ స్పూన్
  • కార్న్ ఫ్లోర్ – 1 టేబుల్ స్పూన్
  • నీరు – 4-5 టేబుల్ స్పూన్లు
  • పచ్చిమిర్చి తరుగు – 1 టీస్పూన్
  • కారం – ¼ టీస్పూన్
  • ఉప్పు – రుచికి సరిపడా

చిల్లీ ఎగ్స్ ఫ్రై కోసం కావాల్సిన పదార్థాలు

  • నూనె – 4 టేబుల్ స్పూన్లు
  • అల్లం తరుగు – ½ టేబుల్ స్పూన్
  • వెల్లుల్లి తరుగు – ½ టేబుల్ స్పూన్
  • ఉల్లిపాయ తరుగు – 4 టేబుల్ స్పూన్లు
  • పచ్చిమిర్చి చీలికలు – 2
  • క్యాప్సికం ముక్కలు – ½ కప్పు
  • చిల్లీ సాస్ / షేజ్వాన్ సాస్ – 1 టేబుల్ స్పూన్
  • రెడ్ చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్
  • గ్రీన్ చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్
  • వేడి నీళ్లు – ½ కప్పు
  • డార్క్ సోయా సాస్ – 1 టీస్పూన్
  • వెనిగర్ – 1 టీస్పూన్
  • మిరియాల పొడి – 1 టీస్పూన్
  • అరోమాటిక్ పౌడర్ – 1 టీస్పూన్
  • వైట్ పెప్పర్ పౌడర్ – ½ టీస్పూన్
  • చక్కెర – 1 టీస్పూన్
  • ఉప్పు – రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు – అలంకరణ కోసం

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో గుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి తరుగు, కారం, ఉప్పు వేసి బాగా బీట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని స్టీమ్ చేసుకోవాలి కాబట్టి ముందుగా ఒక కేక్ టిన్ తీసుకుని నెయ్యి లేదా నూనెతో గ్రీస్ చేయాలి. ఇందులో గుడ్ల మిశ్రమాన్ని పోసి సిద్ధం చేసుకోవాలి. స్టీమ్ చేయడం కోసం పెద్ద గిన్నెలో రెండు గ్లాసుల నీరు పోసి స్టాండ్ ఉంచాలి. ఈ స్టాండ్ పై కేక్ టిన్ పెట్టి గిన్నెకు మూత పెట్టి హై ఫ్లేమ్‌లో 15 నిమిషాలు స్టీమ్ చేయాలి. పూర్తిగా ఉడికిన తర్వాత మిశ్రమాన్ని చల్లబరచి, టిన్ నుంచి బయటకు తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి.

ఒక గిన్నెలో మైదా, కార్న్ ఫ్లోర్ వేసి కొద్దికొద్దిగా నీరు పోసి మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇది చాలా మందంగా లేకుండా.. మరీ పల్చగా కూడా కాకుండా ఉండాలి. ఇప్పుడు స్టవ్‌పై ఒక పాన్ పెట్టి నూనె వేడిచేయాలి. స్టీమ్ చేసిన గుడ్ల ముక్కలను పిండిలో ముంచి వేడి నూనెలో వేయాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్, క్రిస్పీగా అయ్యాక బయటకు తీసి ఉంచుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేడిచేయాలి. అందులో అల్లం, వెల్లుల్లి తరుగు వేసి బాగా వేయించాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి.

అవి కాస్త మెత్తబడిన తర్వాత చిల్లీ సాస్, షేజ్వాన్ సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వేడి నీరు వేసి బాగా కలపాలి. సాసులు కాస్త చిక్కబడిన తర్వాత డార్క్ సోయా సాస్, వెనిగర్, మిరియాల పొడి, అరోమాటిక్ పౌడర్, వైట్ పెప్పర్, చక్కెర, ఉప్పు వేసి స్టవ్ హై ఫ్లేమ్‌లో ఉంచి కలపాలి.

చివరగా క్రిస్పీగా ఫ్రై చేసిన గుడ్ల ముక్కలు ఇందులో వేసి మిక్స్ చేయాలి. ఒక్క నిమిషం వేయించాక కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంతే సింపుల్.. రెస్టారెంట్ స్టైల్ స్పైసీ, టేస్టీ చిల్లీ ఎగ్స్ రెసిపీ రెడీ అయ్యింది. ఇలా ఇంట్లోనే రెస్టారెంట్ లెవల్ స్పైసీ అండ్ క్రిస్పీ చిల్లీ ఎగ్స్ రెసిపీని సులభంగా తయారు చేయండి. ఇంకెందుకు ఆలస్యం ఇది ఓసారి ప్రయత్నించి మీ కుటుంబ సభ్యులకు సర్ప్రైజ్ ఇవ్వండి.

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ