AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలకు ఇష్టమైన చాక్లెట్ పీనట్ కుకీస్ ఇంట్లోనే చేసుకోండి.. రెసిపీ మీ కోసం

ఇంట్లో పిల్లలు ఉంటే తప్పనిసరిగా స్నాక్స్ ఉండాల్సిందే. ఆయితే ఎన్ని రకాల స్నాక్స్ ఉన్నా.. చాక్లెట్స్, బిస్కట్స్ ఇవ్వమని అడుగుతారు. మార్కెట్ లో దొరికే కుకీస్ ను ఇంట్లోనే చేసుకోవచ్చు. పిల్లల కోసం రుచికరమైన, ఆరోగ్యకరమైన చాక్లెట్ పీనట్ కుకీస్ తయారు చేయడం చాలా సులభం. ట్లో క్రిస్పీ కుకీస్ తయారీ రెసిపీ మీ కోసం

పిల్లలకు ఇష్టమైన చాక్లెట్ పీనట్ కుకీస్ ఇంట్లోనే చేసుకోండి.. రెసిపీ మీ కోసం
Chocolate Peanut Cookies
Surya Kala
|

Updated on: Oct 21, 2025 | 12:19 PM

Share

పిల్లలు ఎక్కువగా ఇష్టపడే ఒక విషయం ఉందంటే అది చాక్లెట్. ఈ చాక్లెట్ కు వేరుశెనగ రుచి జత కలిపినప్పుడు..ఆ కుకీలు మరింత ప్రత్యేకంగా మారుతాయి. పిల్లల లంచ్ బాక్స్‌లు , సాయంత్రం స్నాక్స్ కోసం సరైన ప్రోటీన్-రిచ్ ఫుడ్ చాక్లెట్ పీనట్ కుకీ. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. వాటిలో ఉండే పీనట్స్ పిల్లలకు శక్తిని అందిస్తాయి. కనుక వాటిని సులభంగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

తయారు చేయడానికి కావలసిన పదార్థాలు

మైదా లేదా గోధుమ పిండి లేదా ఓట్స్ పౌడర్ – 1 కప్పు

ఇవి కూడా చదవండి

కోకో పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు

వేరుశెనగ వెన్న – 1/2 కప్పు

వెన్న – 1/2 కప్పు

చక్కెర పొడి – ½ కప్పు

బేకింగ్ పౌడర్ – 1 స్పూన్

పాలు – 2 టేబుల్ స్పూన్లు

వెనిల్లా ఎసెన్స్ – ½ స్పూన్

చాక్లెట్ చిప్స్ – 2 టేబుల్ స్పూన్లు (ఐచ్ఛికం)

డ్రై ఫ్రూట్స్ – 2 టేబుల్ స్పూన్లు

చాక్లెట్ పీనట్ కుకీస్ రెసిపీ:

ముందుగా, ఒక గిన్నెలో వెన్న ,చక్కెర పొడిని తీసుకుని క్రీమీగా అయ్యే వరకు బీట్ చేయండి. అందులో పీనట్ బటర్, వెనిల్లా ఎసెన్స్ వేసి మళ్ళీ కలపండి.

ఇప్పుడు వేరొక గిన్నె తీసుకుని అందులో తీసుకున్న మైదా లేదా గోధుమ పిండి లేదా ఓట్స్ పౌడర్, కోకో పౌడర్ , బేకింగ్ పౌడర్‌ను జల్లెడ పట్టండి. ఈ పొడి మిశ్రమానికి వెన్న మిశ్రమాన్ని నెమ్మదిగా జోడించండి. తర్వాత కొద్దికొద్దిగా పాలు పోసి మెత్తని చపాతీ పిండిగా తయారు చేయండి. పిండి కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి.

ఇప్పుడు.. బాగా కలిపినా పిండి మిశ్రమాన్ని తెసుకుని కావాల్సిన సైజ్ లో చిన్న చిన్న ఉండలుగా చుట్టి.. ఆ ఉన్దలకు కుకీ ఆకృతిని ఇవ్వండి( పిల్లలకు ఇష్టమైన ఆకారంలో కుకీలను తయారు చేసుకోండి). పైన చాక్లెట్ చిప్స్, డ్రై ఫ్రూట్స్ వేయండి.

ముందుగా వేడిచేసిన ఓవెన్‌లో 180°C వద్ద 12–15 నిమిషాలు బేక్ చేయండి. కుకీలు క్రిస్పీగా అయ్యేవరకూ చల్లబరచండి. అంతే చాక్లెట్ పీనట్ కుకీస్ రెడీ. వీటిని చల్లార్చిన తర్వాత గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేసి.. భోజనం లేదా అల్పాహారం ముగించిన తర్వాత ప్రతిరోజూ ఈ సర్వ్ చేయండి.

Note: ఓవెన్ లేకుండా చాక్లెట్ పీనట్ కుకీస్ ని తయారు చేయాలనుకుంటే.. గ్యాస్ మీద పెద్ద పాత్ర పెట్టి అందులో ఉప్పు వేసి దానిపైన కుక్కర్‌ పెట్టి కుకీలను బేక్ చేయవచ్చు.

ఈ స్నాక్స్ రుచికరమైనవి మాత్రమే కాదు పిల్లలకు మంచి శక్తి , ప్రోటీన్ ఫుడ్ కూడా..

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?