AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: జీతం కంటే టార్గెట్స్ పెంచడంపైనే కంపెనీ దృష్టి.. ఉద్యోగి రిజైన్ లెటర్ వైరల్

కార్పొరేట్ ప్రపంచంలో అడుగు పెట్టాలని.. అక్కడ కెరీర్ లో దూసుకుపోవాలని.. భారీ జీతం అందుకోవాలని యువత కలలు కంటూ ఉంటుంది. అయితే కార్పొరేట్ ఉద్యోగం అంటే కత్తిమీద సాము అని కొందరు అంటారు. ప్రస్తుతం ఒక ఉద్యోగి రిజైన్ లెటర్ ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. అది చూసిన వారు కార్పొరేట్ జీవితంలో విశ్వసనీయత అనేది ఎడారిలో ఎండమావి వంటిది అని అంటున్నారు.

Viral News: జీతం కంటే టార్గెట్స్ పెంచడంపైనే కంపెనీ దృష్టి.. ఉద్యోగి రిజైన్ లెటర్ వైరల్
Resignation Letter Viral News
Surya Kala
|

Updated on: Oct 21, 2025 | 11:56 AM

Share

నేటి యువతలో చాలా మందికి స్థిరమైన ఉద్యోగం ఒక జీవనాధారం. ఇది వారి కుటుంబాలను పోషించుకోవడానికి సహాయపడుతుంది. కానీ పని చేసే చోట క్రమంగా ఒత్తిడి , ప్రతికూల వాతావరణంతో నిండిపోయినప్పుడు.. ఉద్యోగం మాత్రమే కాదు జీవితం కూడా భారంగా మారుతుంది. కొన్నిసార్లు, మంచి స్థానం, మంచి జీతం ఉన్నప్పటికీ.. చేస్తున్న పని భరించలేనిదిగా అనిపిస్తుంది. ముఖ్యంగా బాస్ లేదా యాజమాన్యం తమ ఉద్యోగికి తగిన మద్దతు ఇవ్వనప్పుడు. అటువంటి పరిస్థితులలో చాలా మంది ఉద్యోగులు ఉద్యోగం ఎంత అవసరం అయినా రాజీనామా చేయడానికే ఇష్టపడతారు,.

ఇటీవల ఇలాంటిదే ఒక కేసు వెలుగులోకి వచ్చింది. ఇది ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతూ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 100,000 మందికి పైగా అనుచరులు ఉన్న టాంజానియా నిర్మాణ సంస్థ JAY డెకర్ పాల్గొంది. ఆ కంపెనీ తన అధికారిక పేజీలో తన ఉద్యోగి రాజీనామా లేఖను షేర్ చేసింది. అది త్వరగా వైరల్ అయింది.

ఇవి కూడా చదవండి

ఆ లేఖలో ఏం రాసి ఉంది? ఈ ఉద్యోగి పేరు A.C. మింజా అని నివేదించబడింది. అతను రాసిన లేఖ చిన్నది కానీ శక్తివంతమైనది. పదాలు సరళంగా ఉన్నప్పటికీ.. అది కోపం, అలసట, నిరాశను స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. తన యజమాని, కంపెనీ విధానాలతో విసుగు చెందిన మింజా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. తన అసంతృప్తిని సూటిగా, సుత్తి లేకుండా నిజాయితీగా సరళమైన భాషలో వ్యక్తం చేశాడు.

తన రాజీనామా లేఖలో “డియర్ సర్, ఈ కంపెనీ టార్గెట్స్ ను మాత్రమే పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.. మా జీతాలను కాదు.. కనుక నేను రాజీనామా చేస్తున్నాను. నేను పనిని మాత్రమే చేయగలను.. మాయాజాలం కాదు.” అని తన బాధని.. కంపెనీ వ్యవరిస్తున్న తీరుని వ్యక్తం చేశాడు. ఈ రిజైన్ లెటర్ లో ఉన్న వ్యాఖ్యలు తక్కువే.. కానీ అందులో దాగున్న సందేశం లోతైనది. ఇది పగలు , రాత్రి పని చేసినా తమకు తగిన ప్రతిఫలం దక్కని ఉద్యోగులందరి భావాలను తెలియజేస్తుంది.

ఆ లేఖపై కంపెనీ అధికారిక ముద్ర కూడా ఉంది. ఇది జోక్ కాదని నిజమైన రాజీనామా అని స్పష్టం ఆ స్టాంప్ తెలియజేస్తుంది. జే డెకర్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ రాజీనామా ఫోటోను షేర్ చేశారు. బహుశా ఈ రాజీనామాని తేలికగా తీసుకోవడం లేదా ఇలాంటి రాజీనామాల వల్ల తాను బాధపడటం లేదని చూపించడానికి ఇలా షేర్ చేసి ఉండవచ్చు. అయితే సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందించారు.

పోస్ట్‌ను ఇక్కడ చూడండి

అంతిమంగా ఈ రిజైన్ లెటర్ మనకు ప్రతి వృత్తిలో గౌరవం, సమతుల్యత అవసరమని తెలియజేస్తుంది. ఒక కంపెనీ తన ఉద్యోగులు సంతృప్తి చెంది, ప్రేరణ పొందినప్పుడు మాత్రమే అభివృద్ధి చెందుతుంది. నిజమైన విజయం కేవలం లక్ష్యాలను అధిగమించడం ద్వారా కాదు..ఉద్యోగులకు వారు తగిన విలువ, అవగాహన , గౌరవాన్ని ఇవ్వడం ద్వారా వస్తుంది. A.C. మింజా చేసిన చిన్న రాజీనామా కొంతమంది మేనేజర్లకు శక్తివంతమైన పాఠంగా ఉపయోగపడుతుందని అంటున్నారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..